ఆక్సిజన్‌ ఇవ్వలేదుగానీ.. యోగాకు వచ్చారు

ABN , First Publish Date - 2022-06-21T17:24:04+05:30 IST

కొవిడ్‌ కాలంలో ఆక్సిజన్‌ లేక ఆసుపత్రుల్లోనే జనం విలవిలలాడారని, ఎంతోమంది ప్రాణాలు కో ల్పోయారని అప్పుడు సకాలంలో సమకూర్చలేదుగానీ

ఆక్సిజన్‌ ఇవ్వలేదుగానీ.. యోగాకు వచ్చారు

                                    - మోదీపై సిద్దూ విమర్శ 


బెంగళూరు, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ కాలంలో ఆక్సిజన్‌ లేక ఆసుపత్రుల్లోనే జనం విలవిలలాడారని, ఎంతోమంది ప్రాణాలు కో ల్పోయారని అప్పుడు సకాలంలో సమకూర్చలేదుగానీ ఇప్పుడు యోగా చేసేందుకు ప్రధాని మోదీ వచ్చారంటూ ప్రతిపక్షనేత సిద్దరామయ్య విమర్శించారు. బెంగళూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు ఆదేశించినా ఆక్సిజన్‌ సమకూర్చలేదని, సుప్రీంకోర్టు నుంచి చీవాట్లు పడ్డాకే ఆక్సిజన్‌ వచ్చిందన్నారు. చామరాజనగర్‌లో ఆక్సిజన్‌ లభించక 36 మంది మృతి చెందారని, రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. 2019, 20లలో వరుసగా వరదలతో రాష్ట్రం అతలాకులతలమైతే ప్రధాని రాలేదని ఆక్రోశం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం 40 శాతం కమీషన్‌పై కేంద్రానికే ఫిర్యాదులు అందాయని, వాటికి సమాధానం చెప్పలేదన్నారు.

Updated Date - 2022-06-21T17:24:04+05:30 IST