Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోశయ్యకు ఘన నివాళి

ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య మృతి తీవ్ర దిగ్భాంతి గురి చేసింది. ఆయన చిత్రపటాల వద్ద ఆర్యవైశ్య సంఘ నాయకులు, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శనివారం నివాళులర్పించారు. పలు చోట్ల స్వచ్ఛందంగా షాపులను మూసి వేసి సంతాపం తెలిపారు. 

కామవరపుకోట, డిసెంబరు 4 : మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతికి కామవరపుకోటలో టీడీపీ నాయకులు శనివారం సంతాప సభ నిర్వహిం చారు. పాతూరులోని మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ నివాసం వద్ద టీడీపీ ఏలూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఘంటా మురళీ, పార్టీ మండల అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ రోశయ్య చిత్ర ప టానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ నాయకులు నాయుడు రామకృష్ణ, జయవరపు శ్రీరామ్మూర్తి, సత్తిపండు, జడ్పీ మాజీ చైర్మన్‌ కె. జయరాజు, మేరుగు సుందరరావు, గోరీక దాసు, తదితరులు పాల్గొన్నారు.

చింతలపూడి : చింతలపూడి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్‌లో రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. సంఘ నాయకులు జల్లిపల్లి శివాజీ, జయవరపు శ్రీరామ్మూర్తి చవ్వా శ్రీనివాసరావు, కంభంపాటి వాసు, విశ్వేశ్వరరావు, చందు, ప్రసాద్‌, కంభంపాటి లక్ష్మణరావు, మానవత సభ్యులు పాల్గొన్నారు.

దేవరపల్లి : దేవరపల్లి, చిన్నాయిగూడెం, యాదవోలు గ్రామాల్లోని ఆర్యవైశ్య సంఘం నాయకులు రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. షాపులు మూసివేసి నివాళులు తెలిపారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి నుదుమాటి శ్రీనివాస్‌, కొర్లెపర నాగరాజు, అమర్‌నాథ్‌, జయవరపు రమేష్‌, మనేపల్లి గణేష్‌నాఽథ్‌, చీమకుర్తి సుబ్బారావు తదితరులు సంతాపం తెలిపారు.

Advertisement
Advertisement