ఎన్నటికీ Dmkలో విలీనం కాదు

ABN , First Publish Date - 2022-02-26T16:00:19+05:30 IST

కోటి మందికిపైగా కార్యకర్తలతో బలంగా ఉన్న అన్నాడీఎంకే ఎన్నడూ డీఎంకేలో విలీనం కాదని, దీనిపై డీఎంకే నేతలు చేపట్టిన గ్లోబెల్‌ ప్రచారానికి ఫుల్‌స్టాఫ్‌ పెట్టాలని అన్నాడీఎంకే సమన్వయకర్త, మాజీ

ఎన్నటికీ Dmkలో విలీనం కాదు

                       - అన్నాడీఎంకే కన్వీనర్‌ Ops


ప్యారీస్‌(చెన్నై): కోటి మందికిపైగా కార్యకర్తలతో బలంగా ఉన్న అన్నాడీఎంకే ఎన్నడూ డీఎంకేలో విలీనం కాదని, దీనిపై డీఎంకే నేతలు చేపట్టిన గ్లోబెల్‌ ప్రచారానికి ఫుల్‌స్టాఫ్‌ పెట్టాలని అన్నాడీఎంకే సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం ఈ అంశంపై ఓ ప్రకటనను విడుదల చేశారు. మిత్రపక్షాల బలంతో మున్సిపల్‌ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించిందని ఎద్దేవా చేశారు. అయితే భవిష్యత్‌లో డీఎంకే, అన్నాడీఎంకే విలీనమవుతుందని రాష్ట్ర సహకార శాఖామంత్రి ఐ.పెరియస్వామి దుష్ప్రచారం చేయడం హాస్యా స్పదంగా ఉందన్నారు. డీఎంకే కుటుంబ పార్టీ కాగా, అన్నాడీఎంకే ప్రజా సమస్యలను ముఖ్యంగా అవినీతి రహిత పాలన అందించాలన్న ఉద్దేశ్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ ఎంజీఆర్‌ స్థాపించారన్నారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత కృషివల్ల అన్నాడీఎంకేలో కోటిమందికి పెగా కార్యకర్తలున్నారనీ, తమది ప్రజా పార్టీ అని దీని కదిలించే శక్తి ఎవ్వరికీ లేదన్నారు. 

Updated Date - 2022-02-26T16:00:19+05:30 IST