Dmk పాలనలో ప్రజలకు మిగిలింది కష్టాలే

ABN , First Publish Date - 2022-05-08T14:01:05+05:30 IST

డీఎంకే ఏడాది పాలనలో ప్రజలకు కష్టాలే మిగిలాయని అన్నాడీఎంకే సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం విమర్శించారు. తంజావూరులోని అన్నాడీఎంకే కార్యాలయంలో మాజీ

Dmk పాలనలో ప్రజలకు మిగిలింది కష్టాలే

                             - పన్నీర్‌సెల్వం విమర్శ


ప్యారీస్‌(చెన్నై): డీఎంకే ఏడాది పాలనలో ప్రజలకు కష్టాలే మిగిలాయని అన్నాడీఎంకే సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం విమర్శించారు. తంజావూరులోని అన్నాడీఎంకే కార్యాలయంలో మాజీ మంత్రులు ఆర్‌.వైద్యలింగం, వెల్లమండి నటరాజన్‌ తదితర నేతలతో కలసి పన్నీర్‌సెల్వం మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో అమలుపరచిన సామాజిక భద్రతా చట్టాలను ఇప్పటి డీఎంకే ప్రభుత్వం క్రమక్రమంగా రద్దు చేయడం వల్ల రాష్ట్రమంతటా బాలికలు, మహిళలు హత్య, అత్యాచారాలకు గురవుతున్నారని, శాంతిభద్రతల పరిరక్షణలో ఈ ప్రభుత్వం విఫలమైందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల్లో ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలుపరచలేదని వ్యాఖ్యానించారు. ఏడాది డీఎంకే పాలనలో పదేళ్లుగా లేని విద్యుత్‌ కోతతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారని ఆరోపించారు. హామీల్లో ఒకటైన నీట్‌ పరీక్షను ఒకే సంతకంతో రద్దుచేస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన సీఎం స్టాలిన్‌ ఆ మాట నిలబెట్టుకోలేదని ఎద్దేవా చేశారు. 30 ఏళ్లలోపు కళాశాల విద్యార్థుల విద్యారుణాలు మాఫీ చేస్తామన్న హామీ గురించి స్టాలిన్‌ ప్రభుత్వం ఈ ఏడాది కాలంగా నోరు మెదపలేదన్నారు. ప్రతిపక్షంగా ఉన్న సమయంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై ఆందోళన చేపట్టిన డీఎంకే ఇప్పటివరకు దీనికి సంబంధించిన వ్యాట్‌ పన్ను తగ్గించలేదన్నారు. ముల్లైపెరియార్‌ వ్యవహారంలో కేరళ ప్రభుత్వాన్ని, మెకెదాటు డ్యాం నిర్మాణ వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం లేక డీఎంకే ప్రభుత్వం చతికిలపడిందని, మొత్తానికి  ఏడాది పాలనలో పాలకులు మొండిచెయ్యి చూపారని ప్రజలు గ్రహించారని పన్నీర్‌సెల్వం వ్యాఖ్యా నించారు.

Read more