ఆన్‌లైన్‌ గేమ్స్‌ నిషేధించండి

ABN , First Publish Date - 2022-06-04T13:00:23+05:30 IST

యువతను పెడద్రోవపట్టిస్తున్న ఆన్‌లైన్‌ గేమ్స్‌పై నిషేధం విధించాలని అన్నాడీఎంకే సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం డిమాండ్‌

ఆన్‌లైన్‌ గేమ్స్‌ నిషేధించండి

                    - ఓపీఎస్‌ డిమాండ్‌


చెన్నై, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): యువతను పెడద్రోవపట్టిస్తున్న ఆన్‌లైన్‌ గేమ్స్‌పై నిషేధం విధించాలని అన్నాడీఎంకే సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఓ ప్రకటన చేస్తూ ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌ గేమ్స్‌ కారణంగా యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వాటి జోలికి పోవద్దని తల్లిదండ్రులు తిడితే తట్టుకోలేక చిన్నవయస్సువారే ఉరిపోసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వీటికి తోడు ఆన్‌లైన్‌ జూదంలో లక్షలాది రూపాయలు కోల్పోయి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌, జూదాలపై ప్రభుత్వం నిషేధం విధించాలని, అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయించి గతంలో ఆన్‌లైన్‌ జూదంపై చేసిన చట్టాన్ని మళ్ళీ అమలు చేసేందుకు ప్రయత్నించాలని డీఎంకే ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.  

Updated Date - 2022-06-04T13:00:23+05:30 IST