2023లో సిద్దూ అహంకారానికి తెర

ABN , First Publish Date - 2021-10-27T17:32:58+05:30 IST

ప్రతిపక్షనేత సిద్దరామయ్య అహంకారానికి 2023లో తెరపడనుందని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మండిపడ్డారు. మంగళవారం విజయపురలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2018లో తాను చేసిన

2023లో సిద్దూ అహంకారానికి తెర

           - మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి


బెంగళూరు(Karnataka): ప్రతిపక్షనేత సిద్దరామయ్య అహంకారానికి 2023లో తెరపడనుందని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మండిపడ్డారు. మంగళవారం విజయపురలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2018లో తాను చేసిన తప్పిదంతోనే సిద్దరామయ్య గెలిచారన్నారు. కుమారస్వామి కర్చీ్‌ఫకు గ్లిజరీన్‌ వేసుకుని ఏడుస్తారనే విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చే శారు. ‘ఇదే నా కర్చీఫ్‌.. చూడండి ఇందులో గ్లిజరీన్‌ ఉందా..’ అంటూ మీడియాకు చూపారు. తమకు టుంబానికి చెందినవారు భావోద్వేగం గల వారన్నారు. ప్రజా సమస్యలు, మానవత్వం విషయాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు తన కళ్లలో నీరు వస్తుందంటూనే మరోసారి మీడియా ముందు ఏడ్చేశారు. దేవేగౌడను ముఖ్యమంత్రి చేసింది తామే అంటూ సిద్దరామయ్య వ్యాఖ్యలపై మండిపడ్డారు. దేవేగౌడ సీఎం అయ్యేనాటికి సిద్దరామయ్య జనతాదళ్‌ పార్టీనే చూడలేదన్నారు. దేవేగౌడ ప్రధాని అయినప్పుడు సిద్దరామయ్య ఎందుకు సీఎం కాలేదని ప్రశ్నించారు. సిద్దరామయ్య ఓ సభ జరిపి జేహెచ్‌ పటేల్‌ను గవర్నర్‌గా ప్లాన్‌ వేశారని, తాను ఎంట్రీ ఇచ్చి అడ్డుకున్నానన్నారు. డీఎంకేతో కలిసి తమిళనాడులోను శివసేనతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కాంగ్రె్‌సది ఏ సెక్యులర్‌ విధానామని ప్రశ్నించారు. తాను బీజేపీతో కలిసి సర్కారు ఏర్పాటుకు సిద్ధమయ్యేందుకు సిద్దరామయ్య కారకులని ఏకంగా జేడీఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు సాగిన కుట్రను తిప్పికొట్టేందుకు అప్పట్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.

Updated Date - 2021-10-27T17:32:58+05:30 IST