ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2021-04-21T06:11:56+05:30 IST

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
పోరంకి టీడీపీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేస్తున్న బోడె ప్రసాద్‌, టీడీపీ నాయకులు

పటమట, ఏప్రిల్‌ 20 : మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయం ఉపాధి నిమిత్తం 13వ డివిజన్‌కు చెందిన నిరుపేద కార్యకర్త కిలాని శ్రీనుకు రూ. 10 వేలు విలువ చేసే జ్యూస్‌ బండిని కార్పొరేటర్‌ ముమ్మనేని ప్రసాద్‌ అందజేశారు. మంగళవారం డివిజన్‌లోని లక్ష్మీపతి నగర్‌లో జరిగిన కార్యక్రమంలో గద్దె రామ్మోహన్‌ పాల్గొని కిలాని శ్రీనుకు బండిని అందజేశారు. ఈ సందర్భంగా కేకును కత్తిరించి చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డివిజన్‌ పార్టీ అధ్యక్షుడు గద్దె ప్రసాద్‌, నాయకులు ఎం. వెంకటరత్నం, కొర్రపాటి శ్రీను, వేములపల్లి శ్రీను, బావరాజు నాని, శాంతి సాయి, శొంఠి సాయిలక్ష్మి, గారపాటి సన్నీ చౌదరి  తదితరులు పాల్గొన్నారు.



పోరంకి టీడీపీ కార్యాలయంలో..

పెనమలూరు  : టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భం గా మంగళవారం పోరంకిలోని టీడీపీ కార్యాలయంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేకును కత్తిరించి పార్టీ నాయకులు కార్యకర్తలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకరరావు, నాయకులు వడ్లమూడి శుభశేఖర్‌, తుమ్మల రాంకుమార్‌, ఆచంట వెంకటచంద్ర, రాజశేఖర్‌, దండమూడి చౌదరి, యార్లగడ్డ సుచిత్ర, దోనేపూడి రమాదేవి పాల్గొన్నారు.


వీరవల్లిలో...

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, ఏప్రిల్‌ 20 : నవ్యాంధ్ర రూపశిల్పి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడని టీడీపీ నాయకులు ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు, లంక సురేంద్ర మోహన బెనర్జీ కొనియాడారు. మండల వ్యాప్తంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీరవల్లి గ్రామ కూడలిలో టీడీపీ అధ్యక్షుడు లంక సురేంద్రమోహన బెనర్జీ కేక్‌ను కట్‌ చేసి పేదలకు పంచారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ పిల్లా అనిత, చండ్ర రోజా, గుండపనేని ఉమావర ప్రసాద్‌, ఉప సర్పంచ్‌ లంక అజయ్‌ కుమార్‌,శ్రీనివాసరావు, రమణ, పిల్లా రామారావు, మావులూరి బాబూరావు పాల్గొన్నారు. 


రంగన్నగూడెంలో జరిగిన కార్యక్రమంలో ప్రవా సాంధ్రుడు తుమ్మల రాంబాబు మాట్లాడుతూ రాబోయే తరాల గురించి అలోచిస్తూ కార్యాచరణ చేసిన విజనరీ లీడర్‌ చంద్రబాబు నాయుడు అని అన్నారు. గ్రామంలో గల ఆంజనేయస్వామి ఆలయంలో సర్పంచ్‌ కసుకుర్తి రంగామణి, ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, పుసులూరి లక్ష్మీ నారాయణ, మైనేనిగోపాలరావు తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


వేలేరులో టీడీపీ అధ్యక్షుడు పాతూరి కొండలరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా రైతు నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు, నేటి యువతకు మార్గదర్శి చంద్రబాబునాయుడన్నారు. కార్యక్రమంలో భవానిశంకర్‌, బసవరాజు, సూర్యప్రసాద్‌  పాల్గొన్నారు. 


ఆరుగొలను, ఓగిరాల, రేమల్లె, మడిచర్ల, కొత్తపల్లి, బిళ్లనపల్లి, తదితర గ్రామాలలో చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలు   ఘనంగా నిర్వహించారు.


హనుమాన్‌జంక్షన్‌ : టీడీపీ అధినేత నారా చంద్రబాబు 71వ జన్మదినం  సందర్భంగా మంగళవారం హనుమాన్‌జంక్షన్‌లో టీడీపీ నేతలు  కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు అందజేశారు. గ్రామ పార్టీ అధ్యక్షులు అట్లూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ  మండల అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు, మూల్పూరి సాయికళ్యాణీ, వీరమాచనేని  బుజ్జి, యలమంచిలి మూర్తి, కాండ్రు అజయ్‌,  గండేపూడి నితీష్‌,మజ్జిగ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-21T06:11:56+05:30 IST