Former Chief Minister: ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ ఆపలేరు

ABN , First Publish Date - 2022-08-16T17:36:38+05:30 IST

శాసనసభ ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల గడువు ఉంది. జేడీఎస్‌(JDS) నేత కుమారస్వామి ముఖ్యమంత్రి(Chief Minister) అవుతానంటూ

Former Chief Minister: ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ ఆపలేరు

                                      - మరోసారి కుమారస్వామి ధీమా 


బెంగళూరు, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): శాసనసభ ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల గడువు ఉంది. జేడీఎస్‌(JDS) నేత కుమారస్వామి ముఖ్యమంత్రి(Chief Minister) అవుతానంటూ పదేపదే వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా సోమవారం మరోసారి బెంగళూరు దాసరహళ్లిలో జేడీఎస్‌ కార్యకర్తల సభలో ఆయన మాట్లాడుతూ తనను ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ, కాంగ్రెస్‏ను నమ్మడం లేదన్నారు. ప్రతి విషయానికి ఢిల్లీ పెద్దలను ఆశ్రయించే పాలనను తిప్పికొడతారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జేడీఎస్‏ను గెలిపించాలని కోరారు. బీజేపీకి చెందిన మంత్రులు వారికి ఇష్టం వచ్చినట్లుగా వార్డుల విభజన చేసుకున్నారని మండిపడ్డారు. జేడీఎస్‏ను దెబ్బతీసేందుకు కుట్రపన్నారని, అందుకు తగిన సమాధానం చెబుదామన్నారు. వచ్చే ఎన్నికల్లో యువతకు టికెట్లు ఇవ్వడం ద్వారా గత తప్పిదాలను సరిదిద్దుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మంజునాథ్‌(MLA Manjunath), ఎమ్మెల్సీ తిప్పేస్వామి, ప్రకాష్‌, రాణి ప్రతాప్‍తో తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-16T17:36:38+05:30 IST