ఈడబ్ల్యూఎస్‌ కోటాపై నిపుణుల కమిటీ

ABN , First Publish Date - 2021-12-01T08:19:05+05:30 IST

అగ్రవర్ణ పేదల(ఈడబ్ల్యూఎస్‌) కోటాకు నిర్ణయించిన అర్హతలను పునఃపరిశీలించడానికి కేంద్రం నిపుణుల కమిటీని నియమించింది....

ఈడబ్ల్యూఎస్‌ కోటాపై నిపుణుల కమిటీ

మూడు వారాల్లోగా నివేదిక: కేంద్రం వెల్లడి

న్యూఢిల్లీ, నవంబరు 30: అగ్రవర్ణ పేదల(ఈడబ్ల్యూఎస్‌) కోటాకు నిర్ణయించిన అర్హతలను పునఃపరిశీలించడానికి కేంద్రం నిపుణుల కమిటీని నియమించింది. కోటాపై ప్రభుత్వ విధివిధానాలను కమిటీ సమీక్షించనుంది. నివేదికను 3 వారాల్లోగా సమర్పించాలని కోరినట్టు కేంద్రం పేర్కొంది. నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని ఈడబ్ల్యూఎస్‌ కోటాపై సుపీరం కోర్టుకు కేంద్రం హామీ ఇచ్చింది. ఈ మేరకు కమిటీని నియమిస్తూ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ మంగళవారం మెమో జారీచేసింది. రూ.8 లక్షల ఆదాయ పరిమితి, ఇతర అంశాల్లో సుప్రీం కోర్టు పరిశీలనలను కమిటీ పరిగణనలోకి తీసుకోనుంది. 

Updated Date - 2021-12-01T08:19:05+05:30 IST