Viral Video: రెస్టారెంట్‌లోకి ఉన్నట్టుండి ఎంట్రీ ఇచ్చిన దున్నపోతు.. మామూలు రచ్చ చేయలేదు కదా..
ABN , First Publish Date - 2022-01-11T02:21:38+05:30 IST
రెస్టారెంట్‌లోకి పశువులు రావడమేంటీ అని అందరికీ ఆశ్చర్యం కలగొచ్చు. కానీ ఒక్కోసారి అనూహ్య సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి..
రెస్టారెంట్‌లోకి పశువులు రావడమేంటీ అని అందరికీ ఆశ్చర్యం కలగొచ్చు. కానీ ఒక్కోసారి అనూహ్య సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ దున్నపోతు రెస్టారెంట్‌లోకి ప్రవేశించింది. అది కూడా రద్దీగా ఉన్న ప్రాంతంలోని రెస్టారెంట్‌కి. లోపలికి ప్రవేశించిన దున్నపోతు చేసిన రచ్చ.. అంతా ఇంతా కాదు.
అది చైనాలోని జిన్హువా అదే రద్దీ ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్. లోపల అంతా ఎవరి పనిలో వారు ఉన్నారు. ఓ వ్యక్తి కూల్ డ్రింక్స్ తాగుతూ తాపీగా నిల్చుని ఉన్నాడు. ఈలోగా బయటి నుంచి ఓ దున్నపోతు వేగంగా దూసుకొచ్చింది. కనురెప్ప మాటులో లోపలికి ప్రవేశించి.. నిల్చుని ఉన్న వ్యక్తిని కొమ్ములతో ఎత్తి పడేసింది. ఉన్నట్టుండి జరిగిన ఈ ఘటనతో పక్కనున్న ఓ వ్యక్తి షాక్ అయ్యాడు.
ఈ కుక్కల వాలీబాల్ గేమ్ మామూలుగా లేదుగా.. అచ్చం మనుషుల్లాగే ఆడుతున్నాయే..
వెంటనే వెళ్లి అతన్ని రక్షించాడు. తర్వాత అంతా కలిసి దున్నపోతును బయటికి తరిమికొట్టారు. తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన మొత్తం రెస్టారెంట్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. స్థానిక కబేళా సెంటర్ నుంచి తప్పించుకుని వచ్చినట్లు తర్వాత తెలిసింది.