Viral News: మూసివున్న థియేటర్ గోడల నుంచి వింత శబ్ధాలు.. భయం భయంగా చూడటానికి వెళ్లిన సిబ్బంది.. చివరకు..

ABN , First Publish Date - 2021-11-15T01:28:25+05:30 IST

సైరాకస్‌ నగరంలో ఓ ప్రముఖ థియేటర్ ఉంది. అయితే కొన్ని రోజులుగా అందులో ప్రదర్శన నిలిపేశారు. రోజూ మాదిరే సిబ్బంది శుభ్రం చేసే పనుల్లో ఉన్నారు. ఎవరి పనుల్లో వారు ఉండగా.. ఇంతలో గోడల నుంచి వింత శబ్ధాలు

Viral News: మూసివున్న థియేటర్ గోడల నుంచి వింత శబ్ధాలు.. భయం భయంగా చూడటానికి వెళ్లిన సిబ్బంది.. చివరకు..

ప్రపంచంలో అప్పుడప్పుడు వింత వింత సంఘటనలు జరుగుతుంటాయి. కొన్ని ఘటనలైతే మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎక్కువవడంతో ఎక్కడెక్కడో జరిగే వింత ఘటనలు తెలుస్తున్నాయి. అలాంటి వీడియోలు, ఫొటోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా న్యూయార్క్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. మూసి ఉన్న థియేటర్ గోడల నుంచి వింత శబ్ధాలు రావడం మొదలెట్టాయి. దీంతో భయం భయంగా చూడటానికి వెళ్లిన సిబ్బందికి.. కళ్లు బయర్లు కమ్మాయి. అసలు ఏం జరిగిందంటే..


సైరాకస్‌ నగరంలో ఓ ప్రముఖ థియేటర్ ఉంది. అయితే కొన్ని రోజులుగా అందులో ప్రదర్శన నిలిపేశారు. రోజూ మాదిరే సిబ్బంది శుభ్రం చేసే పనుల్లో ఉన్నారు. ఎవరి పనుల్లో వారు ఉండగా.. ఇంతలో గోడల నుంచి వింత శబ్ధాలు రావడం మొదలయ్యాయి. ఒక్కసారిగా సిబ్బంది మొత్తం షాక్ అయ్యారు. గోడలో ఏముందో వారికి అర్థం కావడం లేదు. లోపల ఏం జరుగుతుందో  అనే కుతూహలంతో భయం భయంగా దగ్గరికి వెళ్లారు. అంతలో ఓ మరుగుదొడ్డి నుంచి హెల్ప్.. హెల్ప్.. అంటూ శబ్ధాలు రావడం మొదలెట్టాయి. దీంతో అక్కడున్న వారికి చెమటలు పట్టాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.


సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. థియేటర్ బాత్‌రూమ్ వద్దకు వెళ్లి పరిశీలించారు. చివరకు లోపల ఓ వ్యక్తి ఇరుక్కున్నట్లు గుర్తించారు. మొదటగా గోడకు రంధ్రం చేసి, కెమెరా సాయంతో అతడి పరిస్థితిని గమనించారు. నగ్నంగా ఉన్న ఆ వ్యక్తిని చూసి షాక్ అయ్యారు. తర్వాత అతి కష్టం మీద గోడను పగులగొట్టారు. చాలా సేపు శ్రమించి.. చివరికి అతన్ని సురక్షితంగా బయటికి తీశారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సుమారు మూడు రోజులుగా అతను అందులోనే ఇరుక్కుని ఉన్నట్లు తెలిసింది. అతడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో వైద్యులు చికిత్స అందించారు.



Updated Date - 2021-11-15T01:28:25+05:30 IST