Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్లాస్టిక్ పైపులో నీళ్లకు బదులుగా.. ధారలుగా నోట్ల కట్టలు.. ఎక్కడో తెలుసా..

ప్లాస్టిక్ పైపు నుంచి ఏమొస్తాయని అడిగితే.. నీళ్లు అని టక్కున సమాధానం చెబుతాం. కానీ కర్ణాటకలో ఓ ఇంటి పైపు నుంచి నీళ్లకు బదులుగా నోట్ల కట్టలు ధారాలంగా వచ్చిపడ్డాయి. బయటికి తీసేకొద్దీ వస్తూనే ఉన్నాయి. ఇలా ఏకంగా రూ.25లక్షలు బయటపడ్డాయి. ఇదేంటి పైపులో డబ్బులు రావడమేంటీ అని అనుకుంటున్నారా.. కింద ఉన్న వీడియో చూస్తే.. మీరు కూడా ముక్కున వేలేసుకుంటారు. అలా జరగడానికి కారణమేంటి.. అనే వివరాల్లోకి వెళితే..

కర్ణాటక కలబురగి జిల్లాలోని పీడబ్ల్యూడీ జూనియర్ ఇంజనీర్ శాంతగౌడ బిరాదార్ ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్రమంగా సంపాదించిన నగదునంతా.. ఆయన ఇలా పైపులో దాచి పెట్టాడు. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు బుధవారం దాడులు చేశారు. పైపు నుంచి తీసే కొద్దీ కట్టలు కట్టలు బయటికి రావడాన్ని చూసి అధికారులే షాక్ అయ్యారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మొత్తం 15మంది అధికారులపై ఆరోపణలు వచ్చాయి. దీంతో 8 మంది ఎస్పీలు, 100 మంది అధికారులు, 300 మంది సిబ్బందితో ఏక కాలంలో దాడులు నిర్వహించారు. జూనియర్ ఇంజనీర్ శాంతగౌడ.. పైపులో నగదు దాచిపెట్టాడని అధికారులకు సమాచారం అందింది. దీంతో ప్లంబర్‌ను పిలిపించి నగదును బయటికి తీయించారు.

మంగళూరుకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లింగేగౌడ, మండ్యకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, దొడ్బళ్లాపూర్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనరశిమయ్య, బెంగళూరుకు చెందిన ప్రాజెక్ట్ మాజీ మేనేజర్ వాసుదేవ్, జనరల్ మేనేజర్ కృష్ణారెడ్డి, జాయింట్ డైరెక్టర్ రుద్రేశప్ప తదితరులపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం అక్రమ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు.


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement