సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-08-15T05:35:26+05:30 IST

స్వాతంత్య్ర సంబరాలకు సర్వం సన్నద్ధమైంది. జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వర్షంలో అవస్థలు పడుతూనే ఆదివారం మైదానాన్ని చదును చేశారు.

సర్వం సిద్ధం
పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ సూర్యకుమారి

                                                    
నేడే జెండా పండగ
పోలీసు పరేడ్‌ గ్రౌండులో నిర్వహణ
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న మంత్రి ముత్యాలనాయుడు
కలెక్టరేట్‌, ఆగస్టు 14:
స్వాతంత్య్ర సంబరాలకు సర్వం సన్నద్ధమైంది. జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వర్షంలో అవస్థలు పడుతూనే ఆదివారం మైదానాన్ని చదును చేశారు. కలెక్టర్‌ సూర్యకుమారి, డీఆర్‌వో గణపతిరావు, ఆర్డీవో సూర్యకళ ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. సోమవారం ఉదయం 9 నుంచి 11ః30 గంటల వరకూ వేడుకలు జరుగనున్నాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రి బూడి ముత్యాల నాయడు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. వివిధ శాఖలు తమ ప్రగతిని చాటే శకటాలు ప్రదర్శన, ఉత్తమ అధికారులకు ప్రశంసాపత్రాల ప్రదానం, స్టాళ్ల ప్రదర్శన తదితర కార్యక్రమాలు ఉన్నాయి. ఈసారి సుమారు 230 మంది అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను మంత్రి అందజేయనున్నారు. వేడుకలకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు హాజరుకానున్నారు.


Updated Date - 2022-08-15T05:35:26+05:30 IST