దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-09-24T06:38:19+05:30 IST

దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం

దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం
మాట్లాడుతున్న ఈవో

ఆన్‌లైన్‌లో రూ.300, రూ.100 దర్శనం టికెట్లు..ఘాట్‌రోడ్డు ఓం టర్నింగ్‌ నుంచి ఐదు క్యూలు.. వీవీఐపీలకే అంతరాలయ దర్శనం

వన్‌టౌన్‌, సెప్టెంబరు 23: ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం నుంచి ప్రారంభంకానున్న దసరా మహోత్స వాలకు సర్వం సిద్ధం చేశామని ఆలయ కార్య నిర్వ హణ అధికారి, జాయింట్‌ కమిషనర్‌ భ్రమరాంబ తెలిపారు. శుక్రవారం మహామండపం ఆరో అం తస్థులో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లా డారు. పది లక్షల మంది భక్తులు వస్తారని అం చనా వేస్తున్నామన్నారు. కెనాల్‌రోడ్డు వినాయకుడి గుడి నుంచి క్యూలు ప్రారంభమవుతాయని, రూ.300, రూ.100 టికెట్లతో దర్శనం చేసుకునే వారికి, వీఐపీలకు, ఉచిత దర్శనం చేసుకునే భక్తులకు ఘాట్‌రోడ్డులో ఓం టర్నింగ్‌ నుంచి ఐదు క్యూలు ఉంటాయని పేర్కొన్నారు. మధ్యలో నైవేద్య సమయాల్లో కొంతసేపు, సాయంత్రం మహా నివేదన, మంత్రపుష్పం, పంచహారతుల సమ యంలో గంట సేపు దర్శనం నిలిపివేస్తారన్నారు. తొలిరోజు అమ్మవారికి స్నపన కార్యక్రమం ఉంటుందని, ఆరోజున ఉదయం 9 గంటల నుంచి  దర్శనానికి అనుమతిస్తామన్నారు. అంతరాలయ దర్శనం గవర్నర్‌, ఛీఫ్‌ జస్టిస్‌, సీఎం వంటి వీవీఐపీలకే ఉంటుందని తెలిపారు. రూ.300. రూ.100 దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచామని, రూ.500 టికెట్‌తోనూ దర్శనం ఉంటుందని, వీటిని ఆన్‌లైన్‌లో ఉంచలేదని తెలిపారు. భక్తులకు భోజ నాలపై నిరయించలేదని, ఇప్పటికైతే లేనట్టేనని తెలిపారు. 21 లక్షల లడ్డూ ప్రసాదాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. పున్నమి ఘాట్‌ వద్ద 200, భవానీ ఘాట్‌ వద్ద 100, సీతమ్మవారి ఘాట్‌ వద్ద 500 షవర్లను ఏర్పాటు చేశామన్నారు. చివరి మూ డు రోజుల్లో భవానీ దీక్షాధారులు వస్తారని, ఇరు ముడి తీయడం, హోమగుండాలు ఇప్పుడు ఉండ వని, భవానీలు వేచి ఉండేందుకు గట్టు వెనుక టీటీడీ స్థలంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వృద్థులు, దివ్యాంగులకు బ్యాటరీ వాహనాలు ఉం టాయని, 200 మంది శానిటేషన్‌ సిబ్బందిని నియ మించామని, దేవదాయశాఖకు చెందిన అసిస్టెంట్‌ కమిషనర్‌ నుంచి వివిధ హోదాల్లో ఉన్న 200 మంది సిబ్బంది పర్యవేక్షణకు వస్తున్నారన్నారు. ఉత్సవాల వ్యయం రూ.4 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నా మన్నారు. గోశాల పక్కన స్థలంలో సాం స్కృతిక కార్యక్రమాలను నిర్వహించను న్నట్లు తెలిపారు. స్థానాచార్యుడు శివప్ర సాద్‌ శర్మ, ముఖ్య అర్చకుడు శ్రీనివాసశాస్త్రి, ఈఈ కోటేశ్వరరావు పాల్గొన్నారు. 





కట్టుదిట్ట ఏర్పాట్లు

ఉత్సవాలను కట్టుదిట్ట ఏర్పాట్ల మధ్య నిర్వహిం చడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు విజయ వాడ పోలీసు కమిషనర్‌ కాంతి రాణా టాటా అన్నారు. ఏర్పాట్లను ఆయన, పోలీసు అధికా రులతో, దుర్గగుడి ఈఈ రమాదేవితో కలిసి పరిశీలించారు. క్యూల నిర్మాణంలో కొంతలోపం ఉండడాన్ని గమనించి సూచనలు చేశారు. క్యూల ను, స్నానఘాట్ల వద్ద ఏర్పాట్లు, ప్రసాదాల కౌంటర్ల ఏర్పాటు, పార్కింగ్‌ ప్రదేశాలు, భక్తులకు మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన ఆరా తీశారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మరింత నిఽఘాను పెంచాలన్నారు. తూర్పు జోన్‌ డీసీపీ విశాల్‌గున్ని, రూరల్‌ డీసీపీ మేరీ ప్రశాంతి, పశ్ఛిమ జోన్‌ ఇన్‌ చార్జి డీసీపీ కొల్లి శ్రీనివాస్‌, పశ్చిమ ఏసీపీ డాక్టర్‌ కె.హనుమంతరావు, సౌత్‌ ఏసీపీ డాక్టర్‌ రవికిరణ్‌ .ట్రాఫిక్‌ అధికారులు పాల్గొన్నారు.



Updated Date - 2022-09-24T06:38:19+05:30 IST