స్వాతంత్య్ర సంబరానికి సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-08-15T05:22:45+05:30 IST

76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు జిల్లా ముసా ్తబైంది. బ్రిటీష్‌ పాలన నుంచి స్వేచ్ఛాయువు పొంది 76 ఏళ్లు కావడంతో మదినిండా దేశభక్తిని నింపుకొని వేడుకలో పాల్గొనేందుకు జిల్లావాసులు రెడీ అయ్యారు. కడపలోని పోలీసు పెరేడ్‌ గ్రౌండ్‌లో

స్వాతంత్య్ర సంబరానికి సర్వం సిద్ధం

వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

ముస్తాబైన కడప

ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌

కడప, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు జిల్లా ముసా ్తబైంది. బ్రిటీష్‌ పాలన నుంచి స్వేచ్ఛాయువు పొంది 76 ఏళ్లు కావడంతో మదినిండా దేశభక్తిని నింపుకొని వేడుకలో పాల్గొనేందుకు జిల్లావాసులు రెడీ అయ్యారు. కడపలోని పోలీసు పెరేడ్‌ గ్రౌండ్‌లో సోమవారం ఉదయం 8:30 గంటలకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ముఖ్యఅతిథిగా హాజరై ఉదయం 9గంటలకు జాతీయ జెండా ఆవిష్క రించనున్నారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తారు. కవాతు పరిశీలన, మార్చ్‌ఫాస్ట్‌ ఉంటాయి. వేడుకల కోసం పోలీసు పెరేడ్‌ గ్రౌండ్‌ ముస్తాబైంది. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులకు మంత్రి సురేష్‌తో సత్కారం ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించనున్నారు. మధ్యాహ్నం 12:55గంటలకు జాతీయ గీతంతో వేడుకలు ముగిస్తారు. ఇప్పటికే కడప నగరంలోని ప్రధాన రహదారులను విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటిపై జాతీయ జండా ఎగురవేస్తామని చెప్పినప్పటికీ అవసరమైన జాతీయ జెండాలు సరఫరా చేయలేదు.



Updated Date - 2022-08-15T05:22:45+05:30 IST