యాదాద్రి: ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌కి ప్రజా సమస్యలు గుర్తుకొస్తాయని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలం పల్లెపహాడ్‌లో గ్రామ ప్రజలతో షర్మిల మాటా ముచ్చట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోట్లు ఖర్చుపెట్టి ప్రాజెక్ట్‌లు నిర్మించారన్నారు. కానీ ఇప్పుడు వరి వేయొద్దని రైతుల నోట్లో మట్టి కొట్టారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే మానేశాయని ఆమె విమర్శించారు.
ఇవి కూడా చదవండి