ప్రతీకాత్మక చిత్రం
కామంతో కళ్లు మూసుకుపోయిన వారికి.. వయసు, వరసలు కనిపించవు. తమ కోరిక తీర్చుకునేందుకు అవసరమైతే ఎదుటి వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. ఇలాంటి శాడిస్టుల గురించి తరచూ వింటూనే ఉంటాం. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువైన విషయం తెలిసిందే. అయితే కొందరు కామాంధులు.. మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఆఖరికి జంతువులను కూడా వదిలిపెట్టడం లేదు. కేరళలో కొందరు ప్రబుద్ధులు చేసిన పనే ఇందుకు నిదర్శనం. మేకల అరుపులు విని అటుగా వెళ్లిన స్థానికులకు షాకింగ్ సీన్ కనిపించింది. ముగ్గురు వ్యక్తులు కడుపుతో ఉన్న మేకను పట్టుకుని చేసిన నిర్వాకం.. స్థానికంగా తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
కేరళలోని కాసర్గాడ్ జిల్లా కన్హంగాడ్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కొత్తచేరిలోని ఓ హోటల్ యజమానికి చెందిన కొన్ని మేకలు బుధవారం వేకువజామున సమీపంలో మేత మేస్తూ ఉన్నాయి. ఈ సమయంలో ఉన్నట్టుండి రెండు మేకలు అరవడం మొదలెట్టాయి. కొద్దిసేపటికి హోటల్ సిబ్బంది.. మేకల అరుపులు విని అక్కడికి వెళ్లారు. అక్కడున్న రెండు మేకల్లో కడుపుతో ఉన్న ఓ మేకను ముగ్గురు వ్యక్తులు పక్కకు లాక్కెళ్లి, అత్యాచారానికి పాల్పడడం చూసి షాక్ అయ్యారు. వెంటనే వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.
హోటల్ సిబ్బందిని చూడగానే నిందితులు పారిపోయారు. ముగ్గురిలో సెంథిల్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. అయితే అప్పటికే కడుపుతో ఉన్న మేక చనిపోయి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మేక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. తమిళనాడుకు చెందిన నిందితుడు సెంథిల్.. ఉపాధి నిమిత్తం కొన్ని నెలల క్రితం ఇక్కడికి వచ్చినట్లు హోటల్ యజమాని తెలిపారు. ఈ వార్త స్థానికంగా సంచలనం సృష్టించడంతో జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి