పెళ్లికాని కుర్రాళ్లే వీళ్ల టార్గెట్.. 11 రాష్ట్రాల్లో 1400 మంది బాధితులు.. ఫోన్ చేసి ఏం మాట్లాడతారంటే..!

ABN , First Publish Date - 2022-03-03T01:53:16+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ ముఠా చేసిన నేరాలు.. పోలీసు ఉన్నతాధికారులనే ఆశ్చర్యానికి గురి చేశాయి. వయసు పైబడి, పెళ్లి కాకుండా ఉన్న అధికారులు కూడా వీరి వలలో చిక్కుకున్నారు...

పెళ్లికాని కుర్రాళ్లే వీళ్ల టార్గెట్.. 11 రాష్ట్రాల్లో 1400 మంది బాధితులు.. ఫోన్ చేసి ఏం మాట్లాడతారంటే..!

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో నేరాలు జరిగే తీరు రోజుకో రకంగా ఉంటోంది. కొన్ని కేసులను పరిష్కరించడానికి పోలీసులు.. తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇటీవల కొన్ని ముఠాలు పెళ్లికాని అబ్బాయిలను టార్గెట్ చేస్తూ.. చాలా తెలివిగా మోసాలు చేయడం చూస్తూనే ఉన్నాం. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ ముఠా చేసిన నేరాలు.. పోలీసు ఉన్నతాధికారులనే ఆశ్చర్యానికి గురి చేశాయి. వయసు పైబడి, పెళ్లి కాకుండా ఉన్న అధికారులు కూడా వీరి వలలో చిక్కుకున్నారు. 15నుంచి 19 ఏళ్లలోపు బాలికలు, యువతులతో ఫోన్లో మాట్లాడించి వీరు చేసే పనులు అందరినీ షాక్‌కు గురి చేశాయి. వివరాల్లోకి వెళితే.. 


మ్యాట్రిమోనీ సైట్లు, కాల్ సెంటర్ల ద్వారా మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 25 మొబైళ్లు, 40 సిమ్‌కార్డులు, మూడు కంప్యూటర్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. గ్వాలియర్‌కు చెందిన అంజలి బాయిస్, నీలు గార్గ్, అంజనా డోంగ్రే, అతుల్ పాల్, కోమల్ పఖారియా, జైదీప్ కుమార్‌ అనే నిందితులు ఓ ముఠాగా ఏర్పడ్డారు. పెళ్లికాని వారు.. అందులోనూ వయసు ఎక్కువ ఉండి, పెళ్లి కాకుండా ఉండే వారిని టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అంతా కలిసి మూడు నకిలీ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లను తయారు చేశారు. అందులో ఎవరి నుంచైనా వివాహానికి సంబంధించి రెజ్యూమ్ అప్‌డేట్ అవగానే, ముందుగా వారి వివరాలు తీసుకుంటారు. అనంతరం బాలికలు, యువతులతో మాట్లాడించి, రిజిస్ట్రేషన్‌ తదితర ఖర్చుల పేరుతో రూ.5వేల నుంచి రూ.10వేల వరకు రాబడతారు. 

అర్ధరాత్రి కేకలు.. కంగారుగా వెళ్లిన ఆ తల్లికి కనిపించిందో షాకింగ్ సీన్.. కొడుకు శవం పక్కనే నిల్చున్న కోడల్ని చూసి..


గ్వాలియర్‌లో మొదలైన వీరి నేరాలు.. అక్కడితో ఆగకుండా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, ఒడిశా, బీహార్, ఉత్తరాఖండ్, జార్ఖండ్.. ఇలా  సుమారు 11 రాష్ట్రాలకు విస్తరించాయి. ఇప్పటి వరకూ వీరి వలలో దాదాపు 1400మందికి పైగానే చిక్కుకున్నారు. ఎక్కువగా 35 నుండి 45 ఏళ్ల వయసు పైబడి పెళ్లి కాకుండా ఉన్న వారు.. తోడు కావాలనే ఉద్దేశంతో వీరిని సంప్రదించి మోసపోయినట్లు తేలింది. ఇటీవల వయసు పైబడిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన రిటైర్డ్ టీఐని కూడా ఈ ముఠా మోసం చేసింది. రూ.5వేలు పంపిన అనంతరం వారి ఫోన్ నంబర్ పని చేయకపోవడంతో ఖంగుతిన్నాడు. ఇంటర్నెట్ నుంచి అందమైన అమ్మాయిల ఫొటోలను తీసుకుని.. ఆ ఫొటోలతో ఆల్బమ్‌లను తయారు చేసేవారని పోలీసులు తెలిపారు. వీరి వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ వార్త స్థానికంగా సంచలనం కలిగించింది.

మీ అమ్మాయి స్కూల్‌కు రావట్లేదంటూ టీచర్ల ఫిర్యాదు.. తల్లిదండ్రులు నిలదీస్తే ఆ బాలిక చెప్పింది విని..

Updated Date - 2022-03-03T01:53:16+05:30 IST