Advertisement
Advertisement
Abn logo
Advertisement

18 ఏళ్ల కూతురు కనిపించడం లేదంటూ ఓ తండ్రి ఫిర్యాదు.. పోలీసులు చెప్పింది విని అంతా షాక్.. మరో యువతితో కలిసి..

హర్యానాకు చెందిన 22 ఏళ్ల యువతి ఏడాది క్రితం రాజస్థాన్‌కు వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు 18ఏళ్ల మరో యువతితో పరిచయమైంది. ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా మారిపోయారు. ఇలా సాగుతుండగా హఠాత్తుగా ఓ రోజు.. 18ఏళ్ల తన కుమార్తె కనిపించలేదంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ అనంతరం పోలీసులు చెప్పింది విని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

హర్యానాలోని అడంపూర్ మండికి చెందిన స్నేహ(22) (పేరు మార్చాం) అనే యువతి ఏడాది క్రితం తన సోదరిని చూడటానికి రాజస్థాన్‌లోని చురు జిల్లా రతన్‌ఘర్‌ పరిధి పండిట్‌పూర్‌‌‌కు వచ్చింది. ఈ క్రమంలో ఈమెకు తన సోదరి భర్త తరఫు బంధువైన ఉష(18) (పేరు మార్చాం) అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో మంచి మిత్రులయ్యారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. గత ఏడాది నవంబర్‌లో ఉన్నట్టుండి ఇద్దరూ అదృశ్యమయ్యారు. ఉష కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వివిధ ప్రాంతాల్లో వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

19ఏళ్ల తర్వాత వెతుక్కుంటూ వచ్చిన అదృష్టం.. ఒక్కసారిగా రూ.8కోట్లు దక్కడంతో..

మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీరి విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. స్నేహ, ఉష ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకున్నట్లు తెలిసింది. తాము ఒకరినొకరు ఇష్టపడ్డామని, కలిసి జీవితాంతం బతకాలని అనుకున్నామని.. పోలీసుల విచారణలో తెలిపారు. ఇద్దరికీ నచ్చజెప్పాలని ఎంత ప్రయత్నించినా.. వారు మాత్రం అంగీకరించలేదు. ఇద్దరం కలిసే బతుకుతామని చెప్పడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఇద్దరు యువతులు పెళ్లి చేసుకోవడం.. స్థానికంగా సంచలనం కలిగించింది.

ఈ సారి నిన్ను దేవుడు కూడా కాపాడలేడు.. ఇదీ ఆస్పత్రిలో ఉన్న భర్తకు ఓ భార్య వార్నింగ్.. ఇంతకీ అసలేం జరిగిందంటే..

ఇవి కూడా చదవండిImage Caption

9నెలల క్రితం కొడుక్కు పెళ్లి.. కాపాడండంటూ రాత్రిపూట కోడలి కేకలు.. కంగారుగా గదిలోకి ఆ తండ్రి వెళ్లి చూస్తే..కూతురు బతుకుతుందని 2నెలలుగా ఎదురుచూపులు.. ఆ తల్లిదండ్రులు రోజూ చేసే పని చూసి..ఆడ వేషం ధరించి ఆన్‌లైన్‌లో అమ్మాయిలకు వల.. నమ్మకం ఏర్పడగానే ప్రేమ నాటకం.. అశ్లీల ఫొటోలతో..అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దొంగ.. దోచుకున్న అనంతరం వంట గదిలో చేసిన చిన్న పనితో.. చివరకు అక్కా చెల్లెళ్లు చేసిన నిర్వాకం.. అర్ధరాత్రి ఓ వ్యక్తిని ఊరి బయటకు రమ్మని.. మరుసటి రోజు చూసేసరికి..ఫిబ్రవరిలో పెళ్లి ఉండగా... ఒప్పందం ప్రకారం నడుచుకోలేదని.. వరుడు తీసుకున్న నిర్ణయం ఎంత వరకు వెళ్లిందంటే..
Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement