డెంగ్యూ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-05-17T06:14:33+05:30 IST

డెంగ్యూ నివారణకు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ పిలుపునిచ్చారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు స్టాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డెంగ్యూ నివారణకు చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులతో మానవహారం నిర్వహించారు.

డెంగ్యూ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
డెంగ్యూ వ్యాధిపై అవగాహన కరపత్రాలను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌,జేసీ ఇతర అధికారులు

ఒంగోలు(కలెక్టరేట్‌), మే 16 : డెంగ్యూ నివారణకు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ పిలుపునిచ్చారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు స్టాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డెంగ్యూ నివారణకు చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులతో మానవహారం నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ చేయి చేయి కలుపుదాం... డెంగ్యూ వ్యాధి నివారిద్ధాం అనే ఇతివృత్తంతో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇళ్లు,పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని ప్రజలను కోరారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని పిలుపునిచ్చారు. టైర్లు, కొబ్బరిబొండాలు, మరుగుదొడ్లలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు.  అనంతరం కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ అవగాహన కార్యక్రమాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌, డీఆర్వో పులి శ్రీనివాసులు, జిల్లా మలేరియా అధికారి జ్ఞానేశ్వరి, డీఎంహెచ్‌వో సురేష్‌ కుమార్‌, డీసీహెచ్‌ఎ్‌స ఉషా, వివిధ శాఖల అధికారులు జీవీ నారాయణరెడ్డి, జాలిరెడ్డి, ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్‌ భాగ్యలక్ష్మీ తదితరులు  ఉన్నారు.



Updated Date - 2022-05-17T06:14:33+05:30 IST