ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలి

ABN , First Publish Date - 2021-06-21T05:13:11+05:30 IST

ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి ఆరోగ్యంగా ఉండాలంటూ కమలాపురం ఎస్‌ఐ తులసీనాగప్రసాద్‌ తెలిపారు. ఆదివారం స్థానిక మూడు రోడ్ల కూడిలో ప్రజలకు కరోనాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలి
ర్యాలీలో పాల్గొన్న ఎస్‌ఐ తులసీనాగప్రసాద్‌

కమలాపురం(రూరల్‌), జూన్‌ 20: ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి ఆరోగ్యంగా ఉండాలంటూ కమలాపురం ఎస్‌ఐ తులసీనాగప్రసాద్‌ తెలిపారు. ఆదివారం స్థానిక మూడు రోడ్ల కూడిలో ప్రజలకు కరోనాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కరోనా ఆకారంలో ఉన్న హెల్మెట్లు, పీపీఈ కిట్లు ధరించి వినూత్నంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ బయటకు వచ్చిన తర్వాత ప్రతిఒక్కరూ మాస్కు వాడాలని, తరచూ శానిటైజర్‌తో, సబ్బులతో చేతులను, శుభ్రం చేసుకోవాలన్నారు. మన ఊరు సేవా సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించినందుకు వారికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు శీలం శ్రీనివాసులు, సభ్యులు కన్నబాబు, శ్రీనివాసులు, రమణాచారి, నిత్య, మహేష్‌, వెంకటేష్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-21T05:13:11+05:30 IST