వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి

ABN , First Publish Date - 2022-08-12T04:55:58+05:30 IST

స్వాతంత్య్ర స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ వజ్రోత్సవాల్లో పాల్గొనాలని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని సబ్‌జైలు నుంచి చెక్‌పోస్టు మీదుగా ఆంధీ చౌక్‌ వరకు చేపట్టిన 2కే రన్‌లో కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, ఎస్పీ సురేష్‌కుమార్‌, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ఆమె పాల్గొన్నారు.

వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి
2కే రన్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్‌, ఎస్పీ, అదనపు ఎస్పీ

జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌, ఆగస్టు 11: స్వాతంత్య్ర స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ వజ్రోత్సవాల్లో పాల్గొనాలని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని సబ్‌జైలు నుంచి చెక్‌పోస్టు మీదుగా ఆంధీ చౌక్‌ వరకు చేపట్టిన 2కే రన్‌లో కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, ఎస్పీ సురేష్‌కుమార్‌, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ స్వాతంత్య్ర స్ఫూర్తితో ప్రతిఒక్కరూ ముందుకు సాగాలన్నారు. కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ మాట్లాడుతూ ప్రస్తుతం 75సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించుకుంటున్నామని, యువత, విద్యా ర్థులు కష్టపడి 2047లో నిర్వహించే శత సంవత్సర వేడుకల్లో ప్రపంచంలోనే భారతదేశాన్ని మొదటి స్థానంలో ఉంచాల్సిన బాధ్యతఉందన్నారు. వజ్రోత్స వాల్లో భాగంగా ఈనెల15న గ్రామపంచాయతీ, మం డల, జిల్లాకేంద్రాల్లో ఒకేసారి జాతీయ గీతాలపన నిర్వహిస్తామని తెలిపారు. అంతకుముందు రోజు బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2కేరన్‌ విజయవం తం చేయడానికి కృషిచేసిన పాఠశాల, ఇంటర్మీడియట్‌, గిరిజన విద్యాశాఖ అధికారులను అభినందించారు. ఎస్పీసురేష్‌ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు మరువలేనివన్నారు. ఏఎస్పీ అచ్చేశ్వర్‌రావు, అదనపు ఎస్పీ ఏఆర్‌ భీంరావు, అదనపు కలెక్టర్‌ రాజేశం, డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ రాణాప్రతాప్‌, ఎస్బీ సీఐ సుధాకర్‌, ఎస్సై రమేష్‌, గంగన్న, డీపీవో రమేష్‌కుమార్‌, ఈవో వంశీ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-12T04:55:58+05:30 IST