వజ్రోత్సవాల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి: మంత్రి

ABN , First Publish Date - 2022-08-11T06:49:14+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం వేల్పూర్‌ మండలం పడిగెల గ్రామ శివారులో మార్కెట్‌ కమిటీ సమీపంలో క్రీడా పార్క్‌లో మొక్కలు నాటారు.

వజ్రోత్సవాల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి: మంత్రి

వేల్పూర్‌, ఆగస్టు 10: రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.  బుధవారం వేల్పూర్‌ మండలం పడిగెల గ్రామ శివారులో మార్కెట్‌ కమిటీ సమీపంలో క్రీడా పార్క్‌లో మొక్కలు నాటారు.  అనంతరం త్రివర్ణ పతకాలను చేతపట్టుకొని దేశభక్తి నినాదాలు చేస్తూ స్థానికులు ఉత్సాహంగా వనమహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ..  ప్రజలందరిలో జాతీయత భావా న్ని పెంపొందించేలా రాష్ట్ర ప్రభు త్వం పక్షం రోజుల పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతుం దన్నారు. అందులో భాగంగానే వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టి మొక్కలు నాటామ న్నారు. స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15రోజున దేశ వ్యాప్తంగా ప్రతీ ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగురవేయాలని సూచిం చారు. రాష్ట్రంలో సుమారు కోటి 20లక్షల నివాసలు ఉన్నాయని, ప్రతీ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తే గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లో చోటు దక్కే అవకాశం ఉందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశానికి స్వేచ్ఛ, స్వాతం త్య్రం అందించేందుకు అనేక మంది త్యాగధనులు కృషి చేశారని, వారి త్యాగాలను స్మరిస్తూ నివాళులు అర్పించే బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతీఒక్కరు జాతియత భావాన్ని పెంపొందించుకొని దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్‌, డీఆర్‌డీవో చంద్రర్‌, ఆర్డీవో శ్రీనివాసులు, ఏసీపీ ప్రభాకర్‌రావు, డీపీవో జయసుధ, ఎంపీపీ బీమ జమున, జడ్పీటీసీ అల్లకొండ భారతి, వైస్‌ఎంపీపీ సురేష్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జైడి నాగాధర్‌రెడ్డి, జిల్లా ఆర్‌టీఏ కమిటీ సభ్యుడు రేగుల్ల రాములు, ఎంపీడీవో కమలాకర్‌రావు, తహసీల్దార్‌ రాజేందర్‌, ఎఎంసీ మాజీచైర్మన్‌ కొట్టాల చిన్నారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T06:49:14+05:30 IST