అమృత్‌ మహోత్సవ్‌లో అందరూ భాగస్వామ్యం కావాలి

ABN , First Publish Date - 2022-08-13T04:55:46+05:30 IST

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో శుక్రవారం పొదుపు సంఘాల మహిళతో ఒంగోలులో ర్యాలీ నిర్వహించారు. దీన్ని స్థానిక ప్రకాశం భవన్‌ వద్ద కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడారు.

అమృత్‌ మహోత్సవ్‌లో అందరూ భాగస్వామ్యం కావాలి
ఒంగోలు చర్చిసెంటర్‌లో బెలూన్‌లను ఎగురవేస్తున్న మహిళలు (ఇన్‌సెట్లో) మార్కాపురంలో జాతీయ జెండాలతో విద్యార్థుల భారీ ర్యాలీ

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పిలుపు

ఒంగోలు (కలెక్టరేట్‌), ఆగస్టు 12 : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో శుక్రవారం పొదుపు సంఘాల మహిళతో ఒంగోలులో ర్యాలీ నిర్వహించారు. దీన్ని స్థానిక ప్రకాశం భవన్‌ వద్ద కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడారు. ఈనెల 1 నుంచి ప్రతి రోజు ప్రత్యేక కార్యక్రమాలతో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటస్ఫూర్తిని, మహానీయుల జీవిత విశేషాలను భావితరాలకు తెలిసేలా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఈనెల 14వతేదీన ఒంగోలు నగరంలో మూడు కిలో మీటర్ల పొడవైన జాతీయ జెండాతో 3కే రన్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో ప్రజలంతా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్వో సరళావందనం, డీఆర్‌డీఏ పీడీ బాబూరావు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్రీనివాసవిశ్వనాథ్‌తోపాటు పలుశాఖల అధికారులు  పాల్గొన్నారు. అంతకు ముందు మహిళలు చర్చిసెంటర్‌లో మూడు రంగుల బెలూన్లను అకాశంలోకి వదిలారు. అక్కడి నుంచి ప్రారంభమైన ర్యాలీ నెల్లూరు బస్టాండు మీదుగా మినీ స్టేడియం వరకు సాగింది.  


Updated Date - 2022-08-13T04:55:46+05:30 IST