ప్రతీ ఒక్కరు ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి

ABN , First Publish Date - 2022-08-11T06:03:36+05:30 IST

- స్వాతంత్య్ర వజ్రోత్సవం సందర్భంగా ప్రతీ ఒక్క రు తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు.

ప్రతీ ఒక్కరు ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి
నడిగూడెంలోని గురుకుల పాఠశాలలో మొక్కలు నాటుతున్న ఉపాధ్యాయులు

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, ఆగస్టు 10:  స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లాలోని పలు మండలాల్లో వన మహోత్సవాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా పలు పాఠశాలల్లో మొక్కలు నాటారు.

- స్వాతంత్య్ర వజ్రోత్సవం సందర్భంగా ప్రతీ ఒక్క రు తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నరు. పట్టణం లోని శ్రీనివాస థియేటర్‌లో జాతిపిత మహాత్మగాంధీ సినిమాను విద్యార్థులతో కలిసి ఆయన తిలకించారు. అనంతరం ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని  నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎల్‌.కిషోర్‌కుమార్‌, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, తాసీల్దార్‌ శ్రీనివా్‌సశర్మ, మునిసిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ వనపర్తి శిరీషలక్ష్మీనారాయణ,ఎంపీపీ చింతా కవితారాధారెడ్డి, విద్యా ధికారి సలీంషరీఫ్‌, చందు నాగేశ్వరరావు పాల్గొన్నారు. 

8 కోదాడలోని  ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమం, మామిడి తోరణాలు, అరటి ఆకులు, ముగ్గులతో అలంకరించే కార్యక్రమాలను ప్రా రంభించామని  ప్రిన్సిపాల్‌ రేపాల శ్రీనివాస్‌ అన్నారు. జాతీయతను పెంచే విధంగా ఈ నెల22 వరకు  కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జి.శ్రీను, పి.జ్యోష్న, లక్ష్మీనారాయణ, బషీరున్నీబేగం, గురవయ్య, వాసు, వేముల వెంకటేశ్వర్లు, జి.యాదగిరి పాల్గొన్నారు. 

-  ఈ నెల 15వ తేదీన ప్రతీ ఇంటిపై జాతీయజెండా ఎగురవేయాలని తిరుమలగిరి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పోతరాజు రజనిరాజశేఖర్‌ అన్నారు. తిరుమలగిరి మునిసిపల్‌ కార్యాలయం ఎదుట ఇంటింటికీ జాతీయ జెండాలు పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో కమిషనర్‌ దం డు శ్రీను, మేనేజర్‌ బుచ్చిబాబు, కౌన్సిలర్లు బత్తుల శ్రీను, జ్యోతి, సరిత, పాల్గొన్నారు

- సూర్యాపేటలోని ఫ్రీడం పార్కులో ఎంపీపీ  మర్ల స్వర్ణలతచంద్రారెడ్డి  మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఇస్తాలాపురం సర్పంచ్‌ తూడి లావణ్య, ఎంపీటీసీ ఇందిర,సర్పంచ్‌లు మంగమ్మ, మంగ్యా, రవీందర్‌, ఎంపీడీవో మల్సుర్‌, సంజీవ, ఈశ్వర్‌, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. 

- జిల్లా కేంద్రంలోని థియేటర్లలో ప్రదర్శించిన గాం ధీ చిత్రాన్ని విద్యార్థులతో కలిసి డీఈవో తిలకించారు.  జిల్లా వ్యాప్తంగా 49 పాఠశాలకు చెందిన 6700మంది విద్యార్థులు చిత్రాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎడీ శైలజ, సెక్టోరి యల్‌ అధికారులు పాల్గొన్నారు.






Updated Date - 2022-08-11T06:03:36+05:30 IST