ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలి

ABN , First Publish Date - 2022-01-18T06:05:08+05:30 IST

కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 98.61 శాతం మొదటి డోసు, 71.65 శాతం రెండో డోవసు, 15-18 ఏళ్ల వయస్సు గల వారికి 46.16 శాతం, 60ఏళ్లు పైబడిన, ప్రంట్‌లైన్‌ వర్కర్‌లకు బూస్టర్‌ డోసు 67.25 శాతం మందికి అందించడం జరిగిందన్నారు. జిల్లాలో అన్నివర్గాల ప్రజలకు

ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలి
అర్జిదారుడితో మాట్లాడుతున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

ఆదిలాబాద్‌ టౌన్‌, జనవరి 17: కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 98.61 శాతం మొదటి డోసు, 71.65 శాతం రెండో డోవసు, 15-18 ఏళ్ల వయస్సు గల వారికి 46.16 శాతం, 60ఏళ్లు పైబడిన, ప్రంట్‌లైన్‌ వర్కర్‌లకు బూస్టర్‌ డోసు 67.25 శాతం మందికి అందించడం జరిగిందన్నారు. జిల్లాలో అన్నివర్గాల ప్రజలకు వందశాతం వ్యాక్సిన్‌ అందించడానికి కలెక్టరేట్‌, ఐటీడీఏ, వార్డులలో వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి టీకా పంపిణీ అందిస్తున్నామని తెలిపారు. అం దులో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ సిబ్బందికి ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ కింద బూస్టర్‌ డోసు అందించడానికి వ్యాక్సిన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆర్డీవో రాజేశ్వర్‌, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు వర్ణ, వివిధ విభాగాల సిబ్బంది, రెవెన్యూ, ట్రెజరి తదితర శాఖల సిబ్బంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు.  
భూ సమస్యలను ధరణి పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి
ఆదిలాబాద్‌ టౌన్‌: జిల్లావ్యాప్తంగా ఉన్న భూ సమస్యలపై మీ సేవ కేంద్రాల ద్వారా ధరణి పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అ న్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో వివిధ సమస్యలపై వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లబ్దిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. భూ స మస్యలు, ఉపాధి కల్పన, వితంతువులకు ఉపాధి అవకాశాలు, కారుణ్య నియమకాలు, తదితర అంశాలకు సంబంధించిన అర్జీలను స్వీకరించి పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ భూములకు సంబంధించిన సమస్యలను సదరు అర్జిదారులు ధరణి పోర్టల్‌లో మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాగా ఉట్నూర్‌ మండలానికి చెందిన వితంతువు లక్ష్మి తనకు ఉపాధి కల్పించాలని కోరగా, షెడ్యుల్డు కులానికి చెందిన అంపల్లిజ్యోతి ఇంటర్‌ పాసయ్యానని ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, కారుణ్య నియమకాలకు సంబంధించిన వాటిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా ప్రజావాణి నిర్వహించపోయినా.. వివిధ సమస్యలపై వచ్చిన అర్జిదారుల నుంచి కలెక్టర్‌ ఫిర్యాదులను స్వీకరించి, ఆయా శాఖల అధికారులతో చర్చిస్తామని పేర్కొన్నారు.

Updated Date - 2022-01-18T06:05:08+05:30 IST