ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలి

ABN , First Publish Date - 2022-01-23T04:03:56+05:30 IST

ప్రతిఒక్కరూ కరోనా టీకా వేసుకోవాలని ఎమ్మెల్సీ యాదవరెడ్డి ప్రజలకు సూచించారు.

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలి
కొండపాక మండలం రవీంద్రనగర్‌లో సర్వేను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి

ఎమ్మెల్సీ యాదవరెడ్డి 

పలు మండలాల్లో కొనసాగుతున్న జ్వర సర్వే

కొండపాక/తొగుట/నంగునూరు/చిన్నకోడూరు/మిరుదొడ్డి/దుబ్బాక/ రాయపోల్‌/గజ్వేల్‌/కొండపాక/సిద్దిపేట రూరల్‌/ములుగు/చేర్యాల/హుస్నాబాద్‌, జనవరి 22 : ప్రతిఒక్కరూ కరోనా టీకా వేసుకోవాలని ఎమ్మెల్సీ యాదవరెడ్డి ప్రజలకు సూచించారు. శనివారం కొండపాక మండలంలోని రవీంద్రనగర్‌లో జరుగుతున్న సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వృద్ధురాలుకు టీకా వేయించి మాట్లాడారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ రాగల సుగుణ, రైతుబంధు సమితి కో ఆర్డినేటర్‌ రాగల దుర్గయ్య, టీ జాగృతి గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు ప్రశాంత్‌, ఎంపీటీసీ సాయిబాబా, కొండపాక పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ అమరేందర్‌, ఎంపీడీవో రాంరెడ్డి, వైద్య సిబ్బంది ఉన్నారు. తొగుట మండలంలోని వివిధ గ్రామాల్లో వైద్య సిబ్బంది శనివారం 2,250 కుటుంబాలను సర్వేచేశారు. అందులో 32 మందికి జలుబు, దగ్గు, జ్వరం ఉన్నట్లు తేలడంతో వారికి మందులు అందజేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ, పంచాయతీశాఖ అధికారులు, ఆశావర్కర్లు పాల్గొన్నారు. నంగునూరు మండలంలోని అన్ని గ్రామాల్లో రెండోరోజైన శనివారం జ్వర సర్వేను నిర్వహించారు. జ్వరం వచ్చి కొవిడ్‌ లక్షణాలు ఉన్నట్లయితే వారికి వెంటనే పరీక్షలు చేస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు, వైద్యసిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు. చిన్నకోడూరు మండలంలోని పెద్దకోడూరు, చంద్లాపూర్‌ గ్రామాల్లో జ్వర సర్వేను డీఎల్‌పీవో వేణుగోపాల్‌ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో సోమిరెడ్డి, సర్పంచులు లింగం, చంద్రకళ, వైద్యసిబ్బంది, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య రాష్ట్రమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ఎంపీపీ సాయిలు అన్నారు. శనివారం మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామంలో జ్వరసర్వేను నిర్వహించారు. అనంతరం ఎంపీపీ సాయిలు, ఎంపీపీ ఉపాధ్యక్షుడు రాజు, లింగం బూస్టర్‌ డోస్‌ను వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజిరెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు రాజు, సర్పంచ్‌ లక్ష్మీయాదగిరి, వైద్యాధికారి మల్లికార్జున్‌, సీహెచ్‌వో లింగమూర్తి, ఆర్‌ఐ శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీ భాస్కరాచారి, నాయకులు పాల్గొన్నారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని శనివారం అన్ని వార్డుల్లో  వైద్యసిబ్బందితో కలిసి స్థానిక కౌన్సిలర్లు జ్వరసర్వేలో పాల్గొన్నారు. రాయపోల్‌ మండలం గొడుగుపల్లిలో జరుగుతున్న ఫీవర్‌ సర్వేను దౌల్తాబాద్‌ జడ్పీటీసీ రణం జ్యోతిశ్రీనివా్‌సగౌడ్‌ శనివారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ శివకుమార్‌ కార్యదర్శి వెంకట్‌స్వామి, ఆశావర్కర్‌, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఫీవర్‌ సర్వేలో ప్రతిఒక్కరూ తమ వివరాలను తెలియజేయాలని ఎఫ్‌డీసీ రాష్ట్ర చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి అన్నారు. గజ్వేల్‌ పట్టణంలోని పలు వార్డులలో జరుగుతున్న ఫీవర్‌సర్వేను పరిశీలించారు. ఆయనవెంట గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, వైస్‌చైర్మన్‌ జకీయోద్దీన్‌, వైద్యాధికారి ఆశ్లేషా, మునిసిపల్‌ సిబ్బంది, ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు, మెప్మా ఆర్‌పీలు తదితరులున్నారు. జ్వరం, జలుబు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని హుస్నాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత సూచించారు. శనివారం ఆమె హుస్నాబాద్‌ పట్టణంలోని 15వ వార్డులో ఇంటింటి జ్వర సర్వేలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ రాజమల్లయ్య, వైస్‌ చైర్‌పర్సన్‌ అయిలేని అనిత, కౌన్సిలర్లు సరోజన, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్‌, అయిలేని శంకర్‌రెడ్డి, అయూబ్‌ పాల్గొన్నారు. కొండపాక మండలంలోని పలు గ్రామాల్లో ఫీవర్‌ సర్వే కొనసాగుతుంది. ఈ సర్వేను మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు దేవి రవీందర్‌, సర్పంచ్‌ కందూరి కనకవ్వాఐలయ్య పర్యవేక్షించారు. సిద్దిపేట మండలం పుల్లూరు గ్రామంలో నిర్వహించిన జ్వర సర్వేను జడ్పీటీసీ కోటగిరి శ్రీహరిగౌడ్‌ శనివారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీదేవి, ఎంపీడీవో సమ్మిరెడ్డి, అర్బన్‌ ఎంపీవో శ్రీనివా్‌సరావు, సర్పంచ్‌ పల్లె నరే్‌షగౌడ్‌, పంచాయతీ కార్యదర్శి రవి, వార్డుసభ్యులు ఎల్లయ్యగారి రమేష్‌, మాదం స్రవంతి రాజు, ఏఎన్‌ఎం శోభ, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు. పుల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో శనివారం 2,154 కుటుంబాలను సర్వే చేసినట్లు మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అజిమోద్దీన్‌ తెలిపారు. ఇద్దరు జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించి వారికి కొవిడ్‌ కిట్లు అందజేశామన్నారు. ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ శ్రీనివాస్‌ అన్నారు. శనివారం ములుగు మండల పరిధిలోని మామిడ్యాల్‌, బైలంపుర్‌, తానేదార్పల్లి గ్రామాల్లో ఫీవర్‌ సర్వేను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ సత్తయ్య చారి, అనంతచారి, ఆశావర్కర్లు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. చేర్యాల మునిసిపల్‌ పరిధిలో నిర్వహిస్తున్న ఫీవర్‌ సర్వేను శనివారం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అంకుగారి స్వ రూపారాణి, కమిషనర్‌ రాజేంద్రకుమార్‌ పరిశీలించారు. ప్రతిఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

Updated Date - 2022-01-23T04:03:56+05:30 IST