ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి

ABN , First Publish Date - 2021-12-09T03:29:37+05:30 IST

ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని డీఎంహెచ్‌వో మనోహర్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మజీద్‌ గల్లీలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు.

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి
దహెగాంలో వైద్యసిబ్బందితో వివరాలు తెలుసుకుంటున్న తహసీల్దార్‌ రామ్మోహన్‌

కెరమెరి, డిసెంబరు 8: ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని డీఎంహెచ్‌వో మనోహర్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మజీద్‌ గల్లీలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. గతం లో తక్కువగా నమోదైన ఏరియాలతో పాటు రైతులు అధికంగా ఉన్న ప్రాంతాలను, గ్రామాలను గుర్తించి సాయంత్రం సమయాల్లో వ్యాక్సిన్‌ వేయాలన్నారు. థర్డ్‌ వేవ్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమ త్తంగా ఉండాలని, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట డిప్యూటీ డీఎం హెచ్‌ సుధాకర్‌నాయక్‌, వైద్యాధికారి సుంకన్న, ఫార్మా సిస్టు ఖలీల్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

రెండో డోసు వ్యాక్సిన్‌ వేయించుకోవాలి..

వాంకిడి: మొదటి డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న వారు రెండో డోసు వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా వేయించుకోవా లని తహసీల్దార్‌ మధుకర్‌ పేర్కొన్నారు. బుధవారం మండలపరిషత్‌ కార్యాలయంలో వ్యాక్సినైజేషన్‌, ఉపా ధిహామీ పథకంపై సమీక్షసమావేశాన్ని   నిర్వహిం చారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వీఆర్‌వో, వీఆర్‌ఏ, వైద్యసిబ్బంది గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ వేయించేందుకు అందుబాటులో ఉన్నారన్నారు. ఉపాధిహామీ పథకంలో కూలీలకు సరిపడ పనులు కేటాయించాలని అన్నారు. ప్రతిఒక్కరికి పని కల్పించాలని ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి సతీష్‌, ఎంపీవో శివకుమార్‌, ఏపీవో షాఖిర్‌ ఉస్మానియా, సర్పంచులు, కార్యద ర్శులు, పాల్గొన్నారు.

దహెగాం: మండల కేంద్రంలోని ఎస్సీవాడలో ఇంటింటికి తిరిగి కరోనా వ్యాక్సిన్‌పై బుధవారం తహసీల్దార్‌ రామ్మోహన్‌రావు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ 18సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ వేయించుకో వాలన్నారు. ఏఎన్‌ఎం లక్ష్మి, అంగన్‌వాడీ టీచర్లు మమత,పద్మ, ఆశాకార్యకర్తలు మహేశ్వరి పాల్గొన్నారు.

సిర్పూర్‌(టి): మండలంలో వంద శాతం కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వందశాతం పూర్తి చేయాలని ప్రత్యేకాధికారి, పీఆర్‌ ఈఈ రామ్మోహన్‌రావు అన్నారు. బుధవారం మండలంలోని హుడ్కిలి, డుబ్బ గూడ, శివపూర్‌, పాతట్లగూడ తదితర గ్రామాల్లో ఆరోగ్య సిబ్బందితో కలిసి ఇంటింట తిరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపోహలకు పోకుండా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేసుకోవాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ రాజేశ్వర్‌, డాక్టర్‌ తిరుపతి, హెల్త్‌ సూపర్‌వైజర్‌ నాగమణి, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎం తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-12-09T03:29:37+05:30 IST