Advertisement
Advertisement
Abn logo
Advertisement

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సదాశివయ్యకు ఇండి గ్లోబల్‌ అవార్డు

కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సదాశివయ్య

జడ్చర్ల, డిసెంబరు 4 : విద్యావ్యవస్థతో పా టు వృక్షశాస్త్రం, హరి తహారం అంశంలో చే స్తున్న సేవలకు గాను జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర అ సిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా క్టర్‌ సదాశివయ్య ఇండి గ్లోబల్‌ అవార్డు అందు కున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇండి గ్లోబల్‌ మీడియా అండ్‌ నెట్‌వర్క్‌ సంయుక్తంగా ఈ అవార్డును అందజేసింది. హైదరాబా ద్‌లోని మేరియట్‌ హోటల్‌లో శనివారం నిర్వహించిన ఇండిగ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ ఫెస్టివల్‌లో కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌, ఉన్నత విద్య చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రిల చేతుల మీదుగా అందుకున్నారు. అవార్డు అందుకున్న సందర్భంగా డాక్టర్‌ సదాశివయ్యను కళాశాల ప్రిన్సిపాల్‌ అప్పియచిన్నమ్మ, అధ్యాపకులు అభినందించారు.

Advertisement
Advertisement