ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలి

ABN , First Publish Date - 2021-09-18T04:36:41+05:30 IST

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలి

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలి
షాద్‌నగర్‌ : వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

  • షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌


షాద్‌నగర్‌రూరల్‌/కొందుర్గు: కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ తెలిపారు. ఫరూఖ్‌నగర్‌ మండలం ఎలికట్టలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఖాజా ఇద్రీస్‌, జడ్పీటీసీ వెంకట్‌రాంరెడ్డి, మాజీ ఎంపీపీ బెంది శ్రీనివా్‌సరెడ్డి, సర్పంచ్‌ సాయి ప్రసాద్‌, నాయకులు మల్లేష్‌, యాదయ్య, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. 

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చెర్కుపల్లి ప్రాఽథమిక పాఠశాల నుంచి వివిధ గురుకులాలకు ఎంపికైన విద్యార్థులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడీడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. 2019-20లో 13 మంది విద్యార్థులు, 2020-21లో 15 మంది విద్యార్థులు వివిధ గురుకుల పాఠశాలలకు 5వ తరగతికి ఎంపిక కావడం హర్షణీయమన్నారు. అంతకుముందు రాంచంద్రాపూర్‌లో మహిళా సంఘాల ద్వారా రుణాలు పొంది, ఏర్పాటు చేసుకున్న వెల్డింగ్‌ షాపును ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే  రుణాల లబ్ధిదారులకు మంజూరైన రూ.9లక్షల చెక్కులను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో వైస్‌ ఎంపీపీ రాజే్‌షపటేల్‌, పీఏసీఎస్‌ చైర్మెన్‌ దామోదర్‌రెడ్డి, సర్పంచులు శ్రీధర్‌రెడ్డి, షరీఫాబేగం జహంగీర్‌, కృష్ణవేణి ప్రేమ్‌కుమార్‌, నర్సింహారెడ్డి, నాయకులు రామకృష్ణ, గోపాల్‌, దర్గా రాంచంద్రయ్య, ఆంజనేయులు, రెడ్డి నర్సింలు, శ్రీకాంత్‌గౌడ్‌, వేణుగోపాల్‌యాదవ్‌, రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వ్యాక్సిన్‌ పట్ల అపోహలు వీడాలి

తలకొండపల్లి/శంషాబాద్‌ రూరల్‌: కరోనా వ్యాక్సిన్‌ పట్ల ప్రజలు అపోహాలు వీడి ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలని జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్‌, ఎంపీపీ నిర్మల అన్నారు. పడకల్‌ గ్రామంలో కరోనా వ్యాక్సినేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు జోగురమేశ్‌, రఘు,  సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు గోపాల్‌నాయక్‌, సర్పంచ్‌లు శ్రీశైలం, లక్ష్మణ్‌, నాయకులు పాల్గొన్నారు. వెల్జాల గ్రామంలో వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని మాజీ ఎంపీపీ సీఎల్‌ శ్రీనివాస్‌ యాదవ్‌ సందర్శించారు. శంషాబాద్‌ మున్సిపల్‌ పరిధి 11వ వార్డు కౌన్సిలర్‌ లావణ్య వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను ప్రారంభించారు. 

Updated Date - 2021-09-18T04:36:41+05:30 IST