ప్రతి ఒక్కరూ కొవిడ్‌ టీకాలు వేయించుకోవాలి

ABN , First Publish Date - 2021-09-17T04:47:49+05:30 IST

అర్హులైన ప్రతి ఒక్కరూ కొవిడ్‌ టీకాలు వేయించుకోవాలని జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు అన్నారు. గురువారం మండలం లోని చిర్రకుంటలో కొవిడ్‌ టీకాకేంద్రాన్ని ప్రారంభిం చారు.

ప్రతి ఒక్కరూ కొవిడ్‌ టీకాలు వేయించుకోవాలి
రెబ్బెనలో వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న ఎంపీపీ సౌందర్య

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 16: అర్హులైన ప్రతి ఒక్కరూ కొవిడ్‌ టీకాలు వేయించుకోవాలని జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు అన్నారు. గురువారం మండలం లోని చిర్రకుంటలో కొవిడ్‌ టీకాకేంద్రాన్ని ప్రారంభిం చారు. ఎంపీపీమల్లికార్జున్‌, ఎంపీవో ప్రసాద్‌, వైద్యుడు సత్యనారాయణ, సర్పంచ్‌ పార్వతిబాయి పాల్గొన్నారు. 

రెబ్బెన: మండలకేంద్రంతోపాటు నంబాల గ్రామ పంచాయతీలో గురువారం వందశాతం వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఎంపీపీ సౌందర్య, జడ్పీటీసీ ఆనంద్‌ ప్రారంభించారు.

కెరమెరి: కొవిడ్‌ టీకా వేయించుకోవాలని ఎంపీపీ మోతిరాం, జడ్పీటీసీ ధ్రుపతాబాయి అన్నారు. గురు వారం పీహెచ్‌సీలో వందశాతం కొవిడ్‌ టీకా కార్యక్ర మాన్ని ప్రారంభించారు.

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలో వార్డుల వారీగా గురువారం కొవిడ్‌ వ్యాక్సిన్‌వేశారు. అంగన్వాడీ తదితర సెంటర్లలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం చేపట్టారు.

దహెగాం: అర్హులందరూ కొవిడ్‌వ్యాక్సిన్‌ వేయించు కోవాలని ఇన్‌చార్జి వైద్యాధికారి చంద్రకిరణ్‌ అన్నారు. మండలంలోని ఆరుసబ్‌సెంటర్లలో 110మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు తెలిపారు.

కౌటాల:మండలంలో వందశాతం కొవిడ్‌ వ్యాక్సినేష న్‌ను పూర్తిచేయాలని ఎంపీపీవిశ్వనాథ్‌ అన్నారు. గురువారం ముత్తంపేట, మొగడ్‌దడ్‌ సబ్‌సెంటర్లలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. అర్హులందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నారు.


Updated Date - 2021-09-17T04:47:49+05:30 IST