ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి

ABN , First Publish Date - 2021-04-11T04:41:09+05:30 IST

కరోనా పాజిటీవ్‌ కేసులు ఉధృతమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా టీకా వేయించుకోవాలని ఎంపీడీవో జాబీర్‌ అహమ్మద్‌ పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి
చిట్వేలిలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేస్తున్న దృశ్యం

గాలివీడు, ఏప్రిల్‌10: కరోనా పాజిటీవ్‌ కేసులు ఉధృతమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా టీకా వేయించుకోవాలని ఎంపీడీవో జాబీర్‌ అహమ్మద్‌ పేర్కొన్నారు. కరోనా నివారణ కొరకు వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలను తొలగించి 45 సంవత్సరాలు వయస్సు దాటిన వారికి వ్యాక్సిన్‌ను అందించడం జరుగుతోందని ఆయన అన్నారు. శనివారం మండల పరిధిలోని ఎగువగొట్టివీడు గ్రామ సచివాలయంలో కొవిడ్‌ టీకాలు 20 మందికి వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూలివీడు, గాలివీడు పీహెచ్‌సీ వైద్యాధికారులు తెలిపారు. 

నందలూరు..: కరోనా వ్యాక్సిన్‌ 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ తప్పక వేయించుకోవాలని నాగిరెడ్డిపల్లె మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ సూర్యనారాయణ కోరారు. శనివారం నాగిరెడ్డిపల్లె ఆరోగ్య ఉపకేంద్రంలో ఆయన కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. 

చిట్వేలి..: మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరధిలోని 13సచివాలయాల పరిధిలో శనివారం డాక్టర్‌ శైలజ ఆధ్వర్యంలో డాక్టర్‌ ప్రసాద్‌గౌడ్‌, డాక్టర్‌ బార్గవి, డాక్టర్‌ మేరీ పర్యవేక్షణలో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ను నిర్వహించినట్లు ఆరోగ్య అధికారి విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. మండలంలో 45సంవత్సరాల వయస్సు కలిగిన 400మందికి వ్యాక్సినేషన్‌ చేయాల్సి ఉండగా టార్గెట్‌ను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ మురళి,  డాక్టర్‌ శైలజ, ఆశాలు తదితరులు పాల్గొన్నారు. 

పుల్లంపేట..: కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలని ప్రధానోపాధ్యాయుడు పి.సాంబశివరావు తెలిపారు. శనివారం బావికాడపల్లె ప్రాథమిక పాఠశాల ఆవరణలో 50 మందికి కరోనా టీకాలు వేశారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎం కళావతి, ఎంహెచ్‌వీవోపీ మధుమణి, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-11T04:41:09+05:30 IST