ప్రతి ఒక్కరూ సైబర్‌ క్రైమ్‌పై అవగాహన కలిగిఉండాలి

ABN , First Publish Date - 2022-08-12T06:01:08+05:30 IST

ప్రతీ ఒక్కరూ సైబర్‌ క్రైమ్‌పై అవగాహన కలిగియుండాలని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అన్నారు.

ప్రతి ఒక్కరూ సైబర్‌ క్రైమ్‌పై అవగాహన కలిగిఉండాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి నాయక్‌

కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌

జగిత్యాల, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ప్రతీ ఒక్కరూ సైబర్‌ క్రైమ్‌పై అవగాహన కలిగియుండాలని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అన్నారు. గురువారం పట్టణంలోని సుమంగళి గార్డెన్స్‌లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైబర్‌ కాంగ్రెస్‌ గ్రాండ్‌ ఫినాలే కార్యక్రమానికి కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌, ఎస్పీ సింధూ శర్మ పాల్గొన్నారు. జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠ శాలల నుంచి ఇద్దరు విద్యార్థుల చొప్పున వంద మంది సైబర్‌ అంబాసి డర్లకు ఇస్తున్న శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద ర్బంగా కలెక్టర్‌ రవి నాయక్‌ మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులు దేశంలోనే ముందు స్థానంలో ఉన్నారన్నారు. ఇందులో ప్రధానంగా ఉమెన్‌ అండ్‌ చిల్డ్రన్స్‌పై జరిగే నేరాలను నిరోదిం చడానికి షీ టీమ్స్‌, ఉమెన్‌ సేఫ్టి వింగ్‌లు సమర్థవంతంగా పనిచేస్తున్నా యన్నారు. ఒక పది సంవత్సరాల కిందట ఇంటర్‌ నెట్‌ వినియోగం చాలా తక్కువగా ఉండేదని, ప్రస్తుతం నెట్‌ వినియోగం విపరీతంగా పెరిగిపో యిందన్నారు. ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సెబర్‌ నేరా ల సంఖ్య పెరుగుతోందన్నారు. ప్రజలు సైబర్‌ నేరాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సైబర్‌ కాంగ్రెస్‌లో శిక్షణ తీసుకు న్న విద్యార్థులు తోటి విద్యార్థులతో పాటు సామాన్య ప్రజలకు సైబర్‌ నేరాల నియంత్రణపై అవగాహన కల్పించాలన్నారు. గ్రాండ్‌ ఫినాలేతో ఆ పకుండా ఎడ్యూకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఉమెన్‌ సేఫ్టీ తెలంగాణ పోలీసు సహకారాలతో మరింత మంది సైబర్‌ అంబాసిడర్లను తయారు చేయాలన్నారు. 


సైబర్‌ నేరాలపై అవగాహణ కల్పించడమే లక్ష్యం...

- జిల్లా ఎస్పీ సిందూ శర్మ

సైబర్‌ నేరాలపై అవగాహణ కల్పించి చైతన్యపరచడమే సైబర్‌ కాంగ్రె స్‌ లక్ష్యమని ఎస్పీ సింధూశర్మ అన్నారు. యంగిస్తాన్‌ స్వచ్చంద సంస్థ ఆ ధ్వర్యంలో తెలంగాణలోని 33 జిల్లాలో 1,650 ప్రభుత్వ ఉన్నత పాఠ శాల ల్లో నుంచి 3,300 మంది విద్యార్థులకు సైబర్‌ భద్రతపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన సుమా రు వందకు పైగా విద్యార్థులకు, 50 మంది ఉపాధ్యాయు లకు పది నెలల పాటు సైబర్‌ నేరాలపై అవగాహణ, నివారణకు శిక్షణను అందించామన్నారు. ప్రస్తుత కాలంలో పేరెంట్స్‌ పిల్లలతో ఒపెన్‌గా మాట్లాడాలని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. సైబర్‌ అంబాసిడర్లు నేరాల నియంత్రణకు తమ వంతు సహకారాలను అందించాలన్నారు. ప్ర తీ ఒక్కరికి సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిం చా లన్నారు. అనంతరం సైబర్‌ అంబాసిడర్లుగా విజయవంతంగా శిక్షణను పూర్తి చేసుకున్న విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలెక్టర్‌ రవి నాయక్‌, ఎస్పీ సింధూ శర్మలు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. షీ టీం, సైబర్‌ క్రైమ్‌ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను కలెక్టర్‌, ఎస్పీలు పరిశీలించారు. వి ద్యార్థులు ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు. ఈ కార్యక్రమం లో జగిత్యాల, మెట్‌పల్లి డీఎస్పీలు ప్రకాశ్‌, రవీంద్ర రెడ్డి, డీసీపీఓ హరీశ్‌, సఖీ సెంటర్‌ ఇంచార్జీ మనీల, ఎస్‌బీ సీఐ శ్రీనివాస్‌, ఐటి కోర్‌ సీఐ సరి లాల్‌, రూరల్‌ సీఐ కృష్ణ కుమార్‌, ఆర్‌ఐ వామన మూర్తి, పలువురు ఎస్‌ఐలు, షీ టీం సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



Updated Date - 2022-08-12T06:01:08+05:30 IST