సైబర్‌ నేరాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలి

ABN , First Publish Date - 2022-08-12T07:33:55+05:30 IST

సైబర్‌ నేరాలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించాలని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌కేశవ్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో సైబర్‌ హార్‌ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు.

సైబర్‌ నేరాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలి
విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌కేశవ్‌

సూర్యాపేట అర్బన్‌, ఆగస్టు 11: సైబర్‌ నేరాలపై ప్రతీ ఒక్కరికీ  అవగాహన కల్పించాలని  కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌కేశవ్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో సైబర్‌ హార్‌ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ సైబర్‌ హార్‌ శిక్షణ ద్వారా జిల్లాలో 1650 మంది టీచర్లు, 3300 మంది విద్యార్థులకు, 80 క్లబ్‌లకు పోలీస్‌ శాఖ శిక్షణ ఇచ్చిందన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన సైబర్‌ అంబాసిడర్‌లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఈవో అశోక్‌, డీఎస్పీలు నాగభూషణం, వెంకటేశ్వర్‌రెడ్డి, సీఐ రాజశేఖర్‌, రమణ, షీటీం పాల్గొంది.




Updated Date - 2022-08-12T07:33:55+05:30 IST