18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవాలి

ABN , First Publish Date - 2021-12-03T05:39:10+05:30 IST

18ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని కలెక్టర్‌ హరిచందన విజ్ఞప్తి చేశారు.

18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు  వ్యాక్సిన్‌ వేయించుకోవాలి
జిల్లా కేంద్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌ హరిచందన

- కలెక్టర్‌ హరిచందన

- పట్టణంలో, ధన్వాడలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం పరిశీలన

నారాయణపేట టౌన్‌, డిసెంబరు 2: 18ఏళ్లు  నిండిన ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని  కలెక్టర్‌ హరిచందన విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలోని 2,11వ వార్డుల్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని కలె క్టర్‌ గురువారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించి 100శాతం వ్యాక్సినేషన్‌ కోసం సమష్టిగా కృషి చేయాల న్నారు. కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌వో  రాంమనోహర్‌, మునిసిపల్‌ కమిష నర్‌ భాస్కర్‌రెడ్డి, కౌన్సిలర్‌ జొన్నల అనితసుభాష్‌ పాల్గొన్నారు. 

5వ వార్డులో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పర్యటన 

జిల్లా కేంద్రంలోని 5వ వార్డులో గురువారం కొన సా గిన కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గందె అనసూయ పరిశీలించారు. మునిసి పాలిటీ పరిధిలో 100శాతం వ్యాక్సినేషన్‌ కార్యక్ర మాన్ని పూర్తి చేసేందుకు ప్రతీఒక్కరు  సహకరించాలన్నారు.  

అందరూ టీకా వేయించుకోవాలి 

 ధన్వాడ/మద్దూరు: ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్‌ తప్పని సరిగా వేసుకోవాలని కలెక్టర్‌ హరిచందన కోరారు. గురు వారం ధన్వాడ మండలం మందిపల్లి తండాలో , మ ద్దూరు మండల కేంద్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను క లెక్టర్‌ నేరుగా పరీశీలించారు. 18 ఏళ్లు  నిండిన వారందరూ మొదటి, రెండవ డోసులు  వేసుకోవా లన్నా రు. అందుకు వైద్య సిబ్బంది ఇంటింటికి తిరుగు తూ టీకా వేయించుకోని వారిని గుర్తించి టీకా వేయాల న్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, వైద్య సిబ్బంది, అధికా రులు అందరు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఎంతవరకు పూర్తి అయిందన్న వివరాలను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు.  

రెండురోజుల్లో పూర్తి చేయాలి

ఊట్కూర్‌: మండలంలో రెండు రోజుల్లో వందశాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని కలెక్టర్‌ కే.చంద్రారెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం మండల కేంద్రంలోని యంకంపేట వీధిలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ కా ర్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న వారి వివరాలు తెలుసుకున్నారు.  కార్యక్రమంలో జడ్పీ సీఈవో సిద్రామప్ప, ఎంపీడీవో కాళప్ప, ఎంపీవో రవికుమార్‌, డాక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డి, పీఆర్‌ జాన్‌బిల్‌మోరే, వార్డు సభ్యుడు ఇస్మాయిల్‌,  ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.

  ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి

 ధన్వాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల ఆదేశానుసారంగా రైతులు యాసంగిలో వరి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కలెక్టర్‌ హరిచందన సూచించారు. గురువారం ధన్వాడ మండలం మందిపల్లి తండాలో వ్యవసాయాశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్‌ వాల్‌పోస్టర్‌ విడుదల చేశారు. అందుకు సం బంధించిన సాగు సమాచార పత్రాలను రైతులకు అందించారు. యాసంగిలో పం డించే వరి ఉప్పుడు బియ్యం చేయుటకు ఉపయోగపడుతుందని ఈ విషయం లో ఎఫ్‌సీఐ కొనుగోలు చేయమని చెబుతుందన్న విషయాన్ని రైతులు గమనించాల ని కోరారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై వైపు మొగ్గు చూపే విధంగా అవగా హన కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందని కలెక్టర్‌ కోరారు. ప్రస్తుతం పరిస్థితిలో వరికి ప్రత్యామ్నాయంగా మినుములు, నువ్వులు, జొన్న పంటలు వేసుకోవచ్చాని వ్య వసాయాధికారులు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి జాన్‌ సుధాకర్‌, ఏవో ప్రదీప్‌కూమార్‌, ఏఈవోలు పాల్గొన్నారు. 



Updated Date - 2021-12-03T05:39:10+05:30 IST