అందరికీ మంచి పేరు తీసుకురావాలి

ABN , First Publish Date - 2022-05-27T04:40:02+05:30 IST

పోటీపరీక్షల్లో విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకరావాలని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. గురువారం పోలీసు శిక్షణ తీసుకున్న అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసు శాఖలో నియామకాల ప్రక్రియ సమీపిస్తున్నందున అంతా సమయాన్ని సద్వినియోగం చేస్తూ ప్రభుత్వ కొలువులు సాధించాలన్నారు.

అందరికీ మంచి పేరు తీసుకురావాలి
స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కోనప్ప

ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 

కాగజ్‌నగర్‌, మే 26: పోటీపరీక్షల్లో విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకరావాలని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. గురువారం పోలీసు శిక్షణ తీసుకున్న అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసు శాఖలో నియామకాల ప్రక్రియ సమీపిస్తున్నందున అంతా సమయాన్ని సద్వినియోగం చేస్తూ ప్రభుత్వ కొలువులు సాధించాలన్నారు. డీఎస్పీ కరుణాకర్‌ మాట్లాడుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పక్కా ప్రణాళిక బద్దంగా ప్రిపేర్‌ అయి పరీక్షలో చక్కటి మార్కులు సాధించాలన్నారు. సమావేశంలో పలువురు కోచింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T04:40:02+05:30 IST