నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-05-21T06:05:18+05:30 IST

నేరాల నియంత్రణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని, శాంతిభద్రతలు కాపాడాలని గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్‌ సూచించారు.

నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
మాట్లాడుతున్న ఏసీపీ గిరి ప్రసాద్‌

- గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్‌

కోల్‌సిటీ, మే 20: నేరాల నియంత్రణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని, శాంతిభద్రతలు కాపాడాలని గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్‌ సూచించారు. శుక్రవారం తెల్లవారుజామున గోదావరిఖని సీతానగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రోగ్రాం నిర్వహించా రు. ప్రతి ఇంటిని సోదా చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 75ద్విచక్ర వాహనాలను, ఏడు ఆటోలను సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసమే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎవరైనా కొత్త వ్యక్తు లు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సీతానగర్‌వద్ద ఉన్న సింగరేణి రైల్వేట్రాక్‌ వద్ద బొగ్గు దొంగతనం చేస్తున్నట్టు సమాచారం ఉందని, బొగ్గు దొంగతనం చేసినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవన్నారు. కాలనీల్లో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వన్‌టౌన్‌ సీఐ రమేష్‌బాబు, టుటౌన్‌ సీఐ శ్రీని వాసరావు, రామగుండం సీఐ లక్ష్మీనారాయణ, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-05-21T06:05:18+05:30 IST