బొడ్డవలసలో నిర్వహించిన బాదుడే బాదుడులో పాల్గొన్న దొన్నుదొర తదితరులు
ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సివేరి దొన్నుదొర
అనంతగిరి, మే 24: 2024లో జరిగే శాసనసభ ఎన్నికల్లో టీడీపీ విజయానికి ప్రతీ ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ ఎస్‌టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సివేరి దొన్నుదొర పిలుపునిచ్చారు. మండలంలోని ఎన్‌ఆర్‌పురం పంచాయతీ బొడ్డవలసలో మంగళవారం బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యావసర సరకుల ధరలు అమాంతం పెంచేసి రాష్ట్రప్రభుత్వం సామాన్యులపై మోయలేని భారం వేస్తుందన్నారు. సామాన్యుడు సైతం ఎటువంటి సమస్యలు లేకుండా జీవనం సాగించాలంటే చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రిగా రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సర్పంచ్‌లు సన్యాసమ్మ, జన్ని అప్పారావు, పాంగిలక్ష్మణరావు, మాదల సింహాద్రి, సోమెల రాంబాబు పాల్గొన్నార