ప్రతిఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలి

ABN , First Publish Date - 2021-08-03T04:42:58+05:30 IST

ప్రతి ఒక్కరూ విధిగా రోడ్డు భద్రత నియమాలను పాటించి తమ ప్రాణాలతో పాటు తమపై ఆధారపడ్డ కుటుంబాలను రక్షించుకోవాలని సీఐ రాజశేఖర్‌ అన్నారు.

ప్రతిఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలి
సంగారెడ్డి పట్టణ శివారులోని పోతిరెడ్డిపల్లిలో వాహనదారులకు రోడ్డుభద్రతపై అవగాహన కల్పిస్తున్న సీఐ శివలింగం

 32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అవగాహన కల్పించిన పోలీసులు

జహీరాబాద్‌, ఆగస్టు 2: ప్రతి ఒక్కరూ విధిగా రోడ్డు భద్రత నియమాలను పాటించి తమ ప్రాణాలతో పాటు తమపై ఆధారపడ్డ కుటుంబాలను రక్షించుకోవాలని సీఐ రాజశేఖర్‌ అన్నారు.  సోమవారం  32వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం జహీరాబాద్‌ సమీపంలోని మహీంద్రా అండ్‌ మహీంద్రా కర్మాగారంలో నిర్వహించిన రోడ్డు భద్రత సూచనలపై కార్మికులకు సీఐ రాజశేఖర్‌, పోలీస్‌ సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ హెల్మెట్‌ ధరించకపోవడం, అతివేగం, రోడ్డు భద్రత నియమాలపై అవగాహన లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల మరణాలు సంభవించడంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, వైకల్యం చెందిన వారి పరిస్థితి దయనీయంగా మారుతోందని తెలిపారు. ప్రజల రక్షణ కోసమే పోలీసు శాఖ రోడ్డు భద్రత నియమాలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. అవగాహనలో ఎస్‌ఐ శ్రీకాంత్‌, పోలీసులు, కర్మాగారం అధికారులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.


ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు

సంగారెడ్డి క్రైం, ఆగస్టు 2: వాహనదారులు రోడ్డు భద్రతా, ట్రాఫిక్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలని సంగారెడ్డి రూరల్‌ సీఐ శివలింగం, ఎస్‌ఐ సుభాష్‌ సూచించారు. సంగారెడ్డి పట్టణ శివారులోని పోతిరెడ్డిపల్లిలో సోమవారం వాహనదారులకు ట్రాఫిక్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 


ఎంఆర్‌ఎఫ్‌ ఉద్యోగులకు అవగాహన

సదాశివపేట, ఆగస్టు 2 : సదాశివపేట పట్టణ పరిధిలోని ఎంఆర్‌ఎఫ్‌ పరిశ్రమ ఉద్యోగులకు, కార్మికులకు సోమవారం పట్టణ ఇన్‌స్పెక్టర్‌ గూడూరి సంతో్‌షకుమార్‌ ట్రాఫిక్‌ నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్‌ నియమ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు.

 

Updated Date - 2021-08-03T04:42:58+05:30 IST