ప్రతీ ఒక్కరూ లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2021-05-18T03:41:26+05:30 IST

ప్రతీ ఒక్కరూ లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలని డీసీపీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. సోమవారం లక్షెట్టిపేటలోని కరీంనగర్‌ చౌరస్తాలో గల పోలీస్‌ చెక్‌పోస్టును సందర్శించారు. పోలీస్‌ సిబ్బందికి సానిటైజర్‌, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. సిబ్బంది జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వహించాలన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నం దున మజ్జిగ, గ్లూకోజ్‌ లాంటివి తీసుకోవాలన్నారు.

ప్రతీ ఒక్కరూ లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలి
లక్షెట్టిపేట పట్టణంలో పోలీస్‌ చెక్‌పోస్టును సందర్శిస్తున్న డీసీపీ

 లక్షెట్టిపేట, మే 17 : ప్రతీ ఒక్కరూ లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలని డీసీపీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. సోమవారం లక్షెట్టిపేటలోని కరీంనగర్‌ చౌరస్తాలో గల పోలీస్‌ చెక్‌పోస్టును సందర్శించారు. పోలీస్‌ సిబ్బందికి సానిటైజర్‌, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. సిబ్బంది  జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వహించాలన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నం దున మజ్జిగ, గ్లూకోజ్‌ లాంటివి తీసుకోవాలన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై మూడు వేలకు పైగా కేసులు నమోదు చేశామని తెలిపారు. సీఐ నారాయణ, ఎస్సై చంద్రశేఖర్‌, దండేపల్లి ఎస్సై శ్రీకాంత్‌, పిఎస్సై హైమ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

దండేపల్లి: లాక్‌డౌన్‌ నిబంధనలకు ప్రజలు సహకరిం చాలని డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సూచించారు. మ్యాదరి పేటలో సోమవారం లాక్‌డౌన్‌ అమలుతీరును పర్యవేక్షించి, రోడ్డుపై రాకపొకలు సాగిస్తున్న వాహనాలను ఆపి తనిఖీలు చేసి పలువురికి జరిమానాలు విధించారు. ఉదయం 10 గం టల తర్వాత అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దన్నారు.  లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పోలీసు సిబ్బందికి   సూచనలు, సలహాలను ఇచ్చారు.  

జన్నారం: లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని డీసీపీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. సోమవారం ఇందన్‌పెల్లి శివారులో ఏర్పాటు చేసిన అటవీ శాఖ చెక్‌పోస్టును తనిఖీ చేశారు. వాహనాలను నిలిపి ఎలాంటి అవసరం కోసం వెళ్తున్నారని వాహనదారులను అడిగి తెలుసుకున్నారు.  ప్రజాహితం కోసమే ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిందని, మండలంలో అమలవుతున్న లాక్‌డౌన్‌ పరిస్థితిని సమీక్షించారు.   జన్నారం అడిషనల్‌ ఎస్సై రాథోడ్‌ తానాజీ తదితరులున్నారు. 


Updated Date - 2021-05-18T03:41:26+05:30 IST