అందరూ ‘అమూల్‌’ సేవలోనే...!

ABN , First Publish Date - 2022-01-25T08:36:08+05:30 IST

అమూల్‌ ప్రాజెక్టుకు సేవలు అందించడానికి ప్రభుత్వం ఒక శాఖ ఉన్నధికారులకు మరో శాఖ బాధ్యతలు అప్పగిస్తోంది.

అందరూ ‘అమూల్‌’ సేవలోనే...!

పశుసంవర్థకశాఖ అధికారులకు అదనపు బాధ్యతలు 

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): అమూల్‌ ప్రాజెక్టుకు సేవలు అందించడానికి ప్రభుత్వం ఒక శాఖ ఉన్నధికారులకు మరో శాఖ బాధ్యతలు అప్పగిస్తోంది. ఈ ప్రాజెక్టు అమలు కోసం ఏడాది క్రితం సహకార శాఖ ఉన్నధికారులను జిల్లాకొకరు చొప్పున ఇన్‌చార్జిలుగా నియమించింది. మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ఏర్పాటు, జగనన్న పాలవెల్లువలో అమూల్‌కు పాలు పోయించే పనుల ను ఇటీవల ఎంపీడీవోలు సహా వివిధ శాఖలకు చెందిన మండల, జిల్లాస్థాయి అధికారులకు అప్పగించింది. తాజాగా పశుసంవర్థక శాఖ అధికారులకు తూనికలు, కొలతల శాఖలో అదనపు బాధ్యతలు అప్పగించింది. పాల సేకరణలో వ్యత్యాసాలు, పాడి రైతులకు సరసమైన ధరల నిర్ణయంలో లోటుపాట్లు లేకుండా చూసే పనులు పశుసంవర్థక అధికారులకు అప్పగించారు. తూనికలు, కొలతల విభాగానికి అదనపు కంట్రోలర్‌గా వ్యవహరించాలని పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ను సర్కారు నిర్దేశించింది. 

Updated Date - 2022-01-25T08:36:08+05:30 IST