మహానాడులో ఊరూరు...!

ABN , First Publish Date - 2022-05-29T05:44:29+05:30 IST

మహానాడు రెండో రోజైన శనివారం చంద్రబాబు సభకు మండలం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రైవేటు వాహనాలలో భారీగా తరలివెళ్లారు.

మహానాడులో ఊరూరు...!
చంద్రబాబు సభకు మండలం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు

ఏలూరి ఆధ్వర్యంలో..

మార్టూరు, మే 28 : మహానాడు రెండో రోజైన శనివారం చంద్రబాబు సభకు మండలం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రైవేటు వాహనాలలో భారీగా తరలివెళ్లారు. ఉదయాన్నే ఇసుకదర్శి ఏలూరి క్యాంపు కార్యాలయం నుంచి టీడీపీ బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు, ఎ మ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో భారీగా కదిలారు. నాగరాజుపల్లికి చెందిన సొసైటీ మాజీ అధ్యక్షుడు దివ్వె కిషోర్‌, దివ్వె పెదవెంకయ్య, దివ్వె చినహనుమంతరావు, దివ్వె శ్రీను, కేళావతు కోటానాయక్‌ ఉన్నారు. నాగరాజుపల్లి నుంచి మిన్నెకంటి రవికుమార్‌ కార్యకర్తలతో కలి సి రాగా, డేగరమూడి, వలపర్ల, బొల్లాపల్లి, ద్రోణాదుల, జొన్నతాళి, రాజుగారిపాలెం, మార్టూరు గ్రామాల నుంచి  వాహనాల్లో తరలివెళ్లారు.

యద్దనపూడి మండలంలోని పూనూరు, యద్దనపూడి, సూరారపల్లి, యనమదల, అనంతవరం, గన్నవరం, పోలూరు, తదితర గ్రామాల నుంచి   నాయకులు, కార్యకర్తలు ప్రైవేటు వాహనాల్లో బయలుదేరివెళ్లారు. ఆయా గ్రామాల్లో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు నిర్వహించిన అనంతరం మహానాడుకు తరలివెళ్లారు.


పర్చూరులో...

పర్చూరు : ఒకవైపు భానుడి భగభగలు మరోవైపు ప్రభుత్వం అలవిమాలిన ఆంక్షలు ఇవేవీ పసుపు సైనికులను ఆపలేకపోయాయి. మండుటెండను సైతం లెక్కచేయకుండా పలు వాహనాల్లో మహానాడుకు వెళ్లారు. నాగులపాలెంలో పెద్దఎత్తున ట్రాక్టర్లతో ర్యాలీగా డప్పు వాయిద్యాలతో బయలుదేరారు. ఎండ తీవ్రతను తట్టుకొనేందుకు ట్రాక్టర్‌కు పైభాగాన కొబ్బరిమట్టలను ఏర్పాటు చేసుకోవటం గమనార్హం. మిగిలిన గ్రామాల్లో సుమారు వందల సంఖ్యలో ప్రత్యేక వాహనాలను ఏర్పాటుచేసుకుని తరలివెళ్లడంతో రహదారులు పసుపుమయమయ్యాయి. 


ఇంకొల్లులో...

ఇంకొల్లు : టీడీపీ వాణిజ్యవిభాగం రాష్ట్ర కార్యదర్శి పాలేరు రామకృష్ణ, మండల నాయకుల ఆధ్వర్యంలో పలు వాహనాలను ఏర్పాటు చేసి మహానాడుకు వెళ్లారు. తొలుత ఇంకొల్లులో ర్యాలీ నిర్వహించారు. గ్రామగ్రామాన కార్లు, ద్విచక్రవాహనాలు బయలుదేరాయి. ముందుగా నేతలు ఇంకొల్లులోని పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాలేరు రామకృష్ణ, వీరగంధం ఆంజనేయులు, కొల్లూరి పానకాలుచౌదరి, కరి శ్రీనివాసరావు, బోడావుల శివయ్య, కొల్లూరి గౌతమ్‌, రాజ, నాగయ్య పాల్గొన్నారు.


చీరాల నుంచి 150కిపైగా వాహనాల్లో...

చీరాల, మే 28 : చీరాల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో 150కు పైగా వాహనాల్లో టీడీపీ శ్రేణులు మహానాడుకు తరలివెళ్లారు. వీరితో పాటు కొందరు స్వచ్ఛందంగా బస్సులలో కూడా వెళ్లారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన వాహనాలు ఒకదానికొకటి జతకలిశాయి. హైవే వెంట రోడ్డు మార్జిన్‌లో చీరాల మండలం ఈపురుపాలెం నుంచి వేటపాలెం మండలం పందిళ్లపల్లి శివారు వరకు నియోజకవర్గ పరిధిలో చంద్రబాబు, లోకేష్‌, ఎంఎం కొండయ్య ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు కూడా ఉత్సాహంగా మహానాడుకు తరలివెళ్లారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.


బల్లికురవలో...

బల్లికురవ : ఒంగోలులో మహానాడుకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి సుమారు మూడు వేల మంది వరకు తరలివెళ్లారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు గ్రామాల నుంచి వాహనాలలో వెళ్లారు. ఎంతో ఉత్సాహంగా నేతలు ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేశారు. తరలి వెళ్లిన వారిలో టీడీపీ మండల అధ్యక్షుడు కొండేటి ఇజ్రాయల్‌, దూళిపాళ్ల హనుమంతరావు, అమరనేని కాశీవిశ్వనాథం, ముండ్రు దానయ్య, మామిళ్లపల్లి ప్రవీణ్‌కుమార్‌, పత్తిపాటి వెంకట్రావు, చింతల రామారావు, చెరుకూరి అంజయ్య, దేవినేని నరేంద్ర, పొగుల శేఖర్‌, వేల్పూరి అబ్రహం, నూనె సుధాకర్‌, తదితరులు ఉన్నారు.


పంగులూరులో...

పంగులూరు : మహానాడుకు మండలంలోని 21 గ్రామాల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు వేలాదిగా తరలివెళ్లారు. ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు ర్యాలీగా వెళ్లాయి. పలు గ్రామాలలో ఎన్టీఆర్‌ జయంతి వేడుక సందర్భంగా గ్రామాలలో శనివారం రాత్రి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 


సంతమాగులూరులో...

సంతమాగులూరు: మండలంలోని అన్ని గ్రామాల నుంచి టీడీపీ నాయకులు కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో మహానాడుకు తరలివెళ్లారు. మండలంలోని అన్ని గ్రామాల నుండి వాహనాలు సంతమాగులూరు అడ్డరోడ్డుకు చేరుకున్నాయి. టీడీపీ మండల అధ్యక్షుడు గాడిపర్తి వెంకట్రావు, తేలప్రోలు రమేష్‌, దూపాటి ఏసోబు, నాగబోతు సుజాత, కోణికి గోవిందమ్మ తదితరులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. 


మేదరమెట్లలో...

మేదరమెట్ల: కొరిశపాడు మండలం నుంచి నాలుగు వేలకు మందికి పైగా మహానాడుకు తరలివెళ్లారు. శనివారం సాయంత్రం మండలంలోని 15 గ్రామాల నుండి స్వచ్ఛందంగా వెళ్ళారు. ఎక్కువ మంది సొంత వాహనాల్లో వెళ్ళగా మరి కొంతమంది అద్దె వాహనాల్లో భారీగా తరలి వెళ్ళారు. 





Updated Date - 2022-05-29T05:44:29+05:30 IST