Abn logo
May 17 2021 @ 00:10AM

ఎక్కడికక్కడే!

  • కట్టుదిట్టంగా ఐదో రోజూ లాక్‌డౌన్‌ 
  • ఉదయం పదిలోపే పనులు పూర్తిచేసుకుంటున్న జనం
యాచారం/ఇబ్రహీంపట్నం/ఆమనగల్లు: కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గత 12వ తేదీ నుంచి అమలు చేస్తున్న పది రోజుల లాక్‌ డౌన్‌ ఆదివారం ఐదో రోజూ విజయవంతమైంది. అత్యవసర పనులప్పుడు మినహా ప్రజలు ఉదయం పది దాటితే బయటకు రావడం లేదు. ఉదయం నాలుగు గంటల సడలింపు సమయంలో పునులు నిత్యావసరాలు, ఇతర పనులు చేసుకుంటున్నారు. లాక్‌డౌన్‌తో రోడ్లు బోసిపోతున్నాయి. దుకాణాలతో మూతతో పట్టణాలు, వీధులు నిర్మానుష్యంగా మారుతున్నారు. యాచారంలో మండలంలో లాక్‌డౌన్‌ పక్కగా అమలైంది. ఆదివారం మాల్‌లో చికెన్‌, మటన్‌, చేపలకు గ్రామాల నుంచి జనం రావడంతో రోడ్డు రద్దీగా మారింది. పదిన్నరకల్లా దుకాండ్లు బంద్‌ చేశారు. ఇబ్రహీంపట్నం డివిజన్‌ పరిధిలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఉదయం పది తరువాత రహదారుల పై వాహనాలను పోలీసులు ఎక్కడికక్కడే నిలిపేశారు. ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి మండలాల్లో లాక్‌డౌన్‌ పక్కాగా అమలు చేస్తున్నారు. ప్రజ లు ఇళ్లలోనే ఉంటూ పోలీసులు, ఇతర అధికారులకు సహకరిస్తున్నారు. శ్రీశైలం-హైదరాబాద్‌ రహదారిపై సీఐ ఉపేందర్‌, ఎస్‌ఐ ధర్మేశ్‌ వాహనాల ను తనిఖీ చేశారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘనలపై ఇప్పటి వరకు 200 కేసులు నమోదు చేశామని సీఐ తెలిపారు. కడ్తాల మండలం మైసిగండి టోల్‌ ప్లా జా వద్ద చెక్‌పోస్ట్‌ పెట్టారు. ఎస్సై సుందరయ్య తనిఖీలు చేస్తున్నారు. తలకొండపల్లి, మండలం గ్రామాలలో లాక్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగుతు ంది. ఎస్‌ఐ వరప్రసాద్‌ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేసి అనవసరంగా రోడ్లపైకి వచ్చినవారిపై కేసులు నమోదు చేశారు. 

  • ఐదో రోజు లాక్‌డౌన్‌  ప్రశాంతం

కందుకూరు/చేవెళ్ల/మొయినాబాద్‌: కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ ఐదో రోజు కొనసాగింది. ఉదయం 10గంటలకే వ్యాపార సముదాయాలను బం ద్‌ చేశారు. సరైన కారణం లేకుండా తిరిగే వాహనాలను కందుకూరు, మహేశ్వరం పోలీసులు తనిఖీలు చేపట్టారు. చేవెళ్ల, షాబాద్‌, శంకర్‌పల్లి, మొయినాబాద్‌ తదితర మండలాల్లో లాక్‌డౌన్‌ కొనసాగింది. ఉదయం  ప్రజలు నిత్యావసర సరుకులు తీసుకున్నారు. కాలనీల్లో సైతం పోలీస్‌ పెట్రోలింగ్‌ నిర్వహించడంతో వీధులన్నీ బోసిపోతున్నాయి. హైదరాబాద్‌-బీజాపూర్‌, బెంగళూర్‌-ముంబాయి హైవేలు నిర్మానుష్యంగా మారాయి. లాక్‌డౌన్‌ రూల్స్‌ బ్రేక్‌ చేస్తే చర్యలు తప్పవని మొయినాబాద్‌ సీఐ రాజు తెలిపారు. మండలంలో రెండు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు.

  • నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు

షాద్‌నగర్‌ రూరల్‌: లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని షాద్‌నగర్‌ ఏసీపీ కుషాల్కర్‌ అన్నారు. షాద్‌నగర్‌ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించిన 70మందిపై కేసులు నమోదుచేసి 15 వాహనాలు సీజ్‌ చేశామన్నారు. కరోనా సోకినా బయట తిరుగుతున్న ముగ్గురిపై కేసు నమోదు చేశామని తెలిపారు. లాక్‌డౌన్‌ నిబ ంధనల ప్రకారం ఉదయం 6నుంచి 10గంటల వరకు మాత్రమే బయట తిరగాలని సూచించారు. షాద్‌నగర్‌లోని అన్ని కాలనీలపై దృష్టిసారించి ప కడ్బందీ చర్యలు తీసుకుంటామని ఏసీపీ తెలిపారు. మెడికల్‌, వ్యవసాయ పనుల వారికే తిరిగే అనుమతుందని ఆయన తెలిపారు.

  • కారణం లేకుండా బయటికెళ్లొద్దు 

షాబాద్‌: ఎలాంటి కారణం లేకుండా బయటకి వెళ్తే చర్యలు తీసుకుంటామని షాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం షాబాద్‌ చెక్‌పోస్టు వద్ద 30 కార్లు, 5 ద్విచక్రవాహనాలను సీజ్‌ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలన్నారు. వివాహాలు, షాపింగ్‌ పేరుతో చాలా మంది ఉదయం 11గంటలు దాటినా  బయట తిరుగుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎస్సై శంకర్‌రెడ్డి, కానిస్టేబుల్స్‌ కృష్ణగౌడ్‌, సత్యనారాయణ, ముస్తఫా తదితరులున్నారు.

Advertisement
Advertisement