Abn logo
Sep 21 2021 @ 01:07AM

ప్రతి రూపాయీ ప్రాణాలు నిలబెట్టేందుకే!

  • శక్తి మేరకు సేవ చేయాలని ప్రతిన బూనా
  • నాలుగు రోజులు ‘అతిథులతో బిజీ’..
  • అందుకే సేవకు దూరమయ్యా
  • సోనూసూద్‌ భావోద్వేగం
  •  పార్టీలు రాజ్యసభ సీటు ఆఫర్‌ చేశాయి
  • రాజకీయ ప్రవేశంపై చెప్పలేనని వ్యాఖ్య

 

ముంబై, సెప్టెంబరు 20: ఆదాయపన్ను శాఖ సోదా లపై బాలీవుడ్‌ స్టార్‌ సోనూసూద్‌ తొలిసారి స్పందించా రు. తన ఫౌండేషన్‌లోని ప్రతి రూపాయీ ఓ విలువైన ప్రాణాన్ని నిలబెట్టేందుకు, ఆర్తులకు సాయం చేసేందుకే ఎదురుచూస్తోందన్నారు. మన నిజాయితీ గురించి మనం ప్రతిసారీ చెప్పుకోవాల్సిన పనిలేదని, అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని ఆయన భావోద్వేగంతో కూడిన ఓ సందేశాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్టు చేశారు.

 ఆదాయపన్ను శాఖ నాలుగు రోజుల పాటు సోనూసూద్‌ ఇల్లు, ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించి.. రూ.20 కోట్లు పన్ను ఎగవేశారని తేల్చిన నేపథ్యంలో ఆయన ఈ పోస్టు చేశారు. ‘‘4 రోజులుగా కొందరు ‘అతిథులతో’ బిజీగా ఉండడంతో మీ సేవకు దూరమయ్యా. నాకు రెండు పార్టీలు రాజ్యసభ సీటును ఆఫర్‌ చేశాయి. మానసికంగా సిద్ధంగా లేనందున తిరస్కరించాను. రాజకీయ ప్రవేశంపై ఇప్పుడే చెప్పలేను. ఆ దిశగా నిర్ణయం తీసుకున్నప్పుడు నేనే వెల్లడిస్తాను’’ అని సోనూసూద్‌ చెప్పారు.