ప్రతి సమస్యకు గ్రామస్థాయిలో పరిష్కారం

ABN , First Publish Date - 2022-08-18T06:24:36+05:30 IST

ప్రజ లకు గ్రామ సచివా లయాల ద్వారానే ముఖ్య మైన సేవలన్నీ అందాలని అనకా పల్లి జిల్లా కల్టెర్‌ రవి పట్టన్‌శెట్టి ఆదేశించారు. మండలంలోని బంగా రమ్మపాలెం, ఆరిపాక సచివాలయా లను బుధవారం సంద ర్శించారు.

ప్రతి సమస్యకు గ్రామస్థాయిలో పరిష్కారం
బంగారమ్మపాలెంలో సంపద కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి

  సచివాలయాల సిబ్బందికి కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి ఆదేశం 

సబ్బవరం, ఆగస్టు 17 : ప్రజ లకు గ్రామ సచివా లయాల ద్వారానే ముఖ్య మైన సేవలన్నీ అందాలని అనకా పల్లి జిల్లా కల్టెర్‌ రవి పట్టన్‌శెట్టి ఆదేశించారు. మండలంలోని బంగా రమ్మపాలెం, ఆరిపాక సచివాలయా లను బుధవారం సంద ర్శించారు. సచి వాలయాల్లో సర్వీసు చార్టులు, సంపద తయారీ కేం ద్రాలను పరిశీలిం చారు.  సచివాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అంతకు ముందు సచివా లయ సిబ్బందితో పౌర సేవలపై సమా వేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తప్పనిసరిగా గ్రీవెన్స్‌ నిర్వహించాలని, ప్రతి సమస్యకు గ్రామ స్థాయిలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, పారదర్శకంగా ప్రజలకు సేవలందించాలని సూచించారు. అనం తరం కలెక్టర్‌ విలేఖర్లతో మాట్లాడుతూ పరిపాలనా వికేంద్రీకరణ వల్ల ప్రజలకు చక్కని సేవలు అందుతున్నాయని చెప్పారు. చిన్నచిన్న సాంకేతిక సమ స్యలు ఉన్నా త్వరలోనే అధిగమిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డీవో రమేష్‌నాయుడు, డిప్యూటీ తహసీ ల్దార్‌ వెంకట్‌, గ్రామ సర్పంచ్‌ దాడి లావణ్య, వైస్‌ ఎంపీపీ ఝాన్సీ లక్ష్మీరాణి, ఏఈలు అర్జున అప్పారావు, శేఖర నాయుడు, హిమబిందు, దాడి కన్నం నాయుడు, బి.ఎం.నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T06:24:36+05:30 IST