Abn logo
Oct 27 2021 @ 01:15AM

ప్రతి దశలోనూ రైతుకు అండ

మెగా చెక్కును అందజేస్తున్న మంత్రి వేణు, జడ్పీ చైర్మన్‌, ఎంపీ, జేసీలు

రైతు భరోసా, సున్నా వడ్డీ పథకాల పంపిణీలో మంత్రి వేణు 

కాకినాడ సిటీ, అక్టోబరు 26: రాష్ట్రంలో వ్యవసాయం అంటే పండుగలా ఉందని, విత్తనం నుంచి విక్రయం వరకు ప్రతి దశలో రైతుకు ప్రభుత్వం అండగా ఉంటోందని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్మోహనరెడ్డి వర్చువల్‌ విఽధానంలో వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, సున్నా వడీ ్డపంట రుణాల పథకం, యంత్ర సేవా పఽథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా ఆర్థిక సహాయాన్ని జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్‌ నుంచి మంత్రి వేణుగోపాల కృష్ణ, జడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, కాకినాడ ఎంపీ వంగా గీత, జాయింట్‌ కలెక్టర్‌ (ఆర్‌) జి.లక్ష్మీశ, జాయింట్‌ కలెక్టర్‌ (డి) కీర్తి చేకూరి, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, కుడా చైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి తదితరులు హాజరయ్యారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హాజరైన రైతులకు మూడు పథకాలకు సంబంధించిన మెగా చెక్కులను ప్రజాప్రతి నిధులు, అధికారులు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ మూడు పథకాల ద్వారా నేరుగా లబ్ధి మొత్తం జమకావడంతో ముందుగానే దీపావళి వచ్చిందన్నారు. జేసీ (ఆర్‌) మాట్లాడుతూ మూడు పథకాలతో  జిల్లాలోని రైతులకు రూ.105.34 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. .రైతులకు అద్దె ప్రాతిపదికన సాగు పనిముట్లను, వ్యవసాయ యంత్రాలను అందు బాటులో ఉంచేందుకు ఆర్‌బీకేలకు అనుసంధానంగా ఏర్పాటుచేసిన మ్యూ నిటీ హైరింగ్‌ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ జేడీ ఎన్‌ విజయ్‌కుమార్‌, డీడీ ఎస్‌ మాధవరావు, ఎల్‌డీఎం ఎస్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.