ప్రతి పేద మహిళను స్వయంశక్తి సంఘంలో చేర్చాలి

ABN , First Publish Date - 2022-07-07T08:36:26+05:30 IST

ప్రతి పేద మహిళను స్వయంశక్తి సంఘంలో చేర్చాలి

ప్రతి పేద మహిళను స్వయంశక్తి సంఘంలో చేర్చాలి

అధికారులకు మంత్రి ముత్యాలనాయుడు ఆదేశం

విశాఖపట్నం, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పేద మహిళను స్వయంశక్తి సంఘంలో చేర్పించడంతో పాటు వారికి సంఘాల నిర్వహణపై అవగాహన కల్పించాలని అధికారులను పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి బూడి ముత్యాలనాయుడు ఆదేశించారు. స్త్రీనిధి ద్వారా వారికి రుణాలు మంజూరు చేయాలని సూచించారు. బుధవారం విశాఖపట్నంలో ఓ హోటల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి డీఆర్‌డీఏ ప్రాజెక్టు అధికారుల వర్క్‌షాపునకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం సదస్సునుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రూపొందించిన నవరత్నాల్లో నాలుగు పథకాలు సెర్ప్‌ (సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పావర్టీ...గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ద్వారా అమలవుతున్నాయన్నారు. డీఆర్‌డీఏ పీడీలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సిబ్బంది పనితీరు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల అమలును అంచనా వేయాలని సూచించారు. జిల్లా సమాఖ్య సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించి ప్రభుత్వ పథకాలపై సంఘాల సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. ఆరునెలకొకసారి ఇటువంటి వర్క్‌షాపులు నిర్వహించాలని మంత్రి సూచించారు.


Updated Date - 2022-07-07T08:36:26+05:30 IST