నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి

ABN , First Publish Date - 2021-09-29T06:00:12+05:30 IST

హరితహారంలో నాటిన ప్రతి మొక్క నూ సంరక్షించాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సూర్యాపేట మండల పరిధిలోని బాలెంల గ్రామం నుంచి రాజనాయక్‌తండా వరకు జాతీయ రహదారికి ఇరువైపులా నాటి

నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి
మద్దిరాల మండల పరిధిలోని రామచంద్రాపురంలో మొక్కలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి 

సూర్యాపేటరూరల్‌/మద్దిరాల/తుంగతుర్తి/ అర్వప ల్లి,సెప్టెంబరు 28: హరితహారంలో నాటిన ప్రతి మొక్క నూ సంరక్షించాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సూర్యాపేట మండల పరిధిలోని బాలెంల గ్రామం నుంచి రాజనాయక్‌తండా వరకు జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను మంగళవారం పరిశీ లించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎండిన మొక్కలు స్థానంలో వెంటనే వేరే మొక్కలు నాటాలన్నారు. జాతీయ వెంట నాటే మొక్కలు పెద్దవిగా ఉండేవిధంగా చూసుకోవాలని ఉపాధి హామీ సిబ్బందికి సూచించారు. వా రం రోజుల్లో మళ్లీ వస్తానని, అప్పటిలోగా అన్ని మొక్కలు నాటాలని అదేశించారు. ప్రతి మొక్కకు రక్షణగా ట్రీగార్డు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడి షనల్‌ పీడీ సురేష్‌, ఏపీడీ రాజు, ఎంపీడీవో శ్రీనివాస్‌రావు తదితరులు ఉన్నారు. మద్దిరాల మండల పరిధిలోని రామ చంద్రాపురం గ్రామ శివారు జాతీయ రహదారికి ఇరువైపు లా నాటిన మొక్కలను కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి పరిశీలిం చారు. ఆయన వెంట ఎంపీడీవో సరోజ, సర్పంచ్‌ వెలుగు వెంకన్న, ఏపీవో రవీందర్‌, ఎంపీవో రాజేష్‌, కార్యదర్శులు మంగమ్మ, పుష్ప ఉన్నారు. తుంగతుర్తి మండలంలోని కర్వి రాల, వెలుగుపల్లి,  కొత్తగూడెం గ్రామాల్లో జాతీయ రహ దారి వెంట నాటిన మొక్కలను కలెక్టర్‌ పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో లక్ష్మి, ఎంపీవో భీంసింగ్‌, ఏపీవో వెంకన్న ఉన్నారు. అర్వపల్లి సమీపంలోని సూర్యాపేట-జనగామవెంట నాటిన మొక్కలను కలెక్టర్‌ కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి పరిశీలించారు. ఆయన వెంట ఏపీవో శైలజ, ఏంపీవో సురేష్‌, పంచాయతీ కార్యదర్శి నాగారాజు, విజయలక్ష్మి, వెంకటేష్‌ ఉన్నారు.

Updated Date - 2021-09-29T06:00:12+05:30 IST