భవీనా రజతంపై స్పందించిన సచిన్ టెండూల్కర్

ABN , First Publish Date - 2021-08-29T21:55:39+05:30 IST

జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌ టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్‌కు

భవీనా రజతంపై స్పందించిన సచిన్ టెండూల్కర్

ముంబై: జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌ టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్‌కు రజతం రూపంలో తొలి పతకం అందించిన భవీనాబెన్ పటేల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు భవీనాను కొనియాడారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు. భారత్ సాధించే ప్రతీ పతకం కోట్లాదిమందికి స్ఫూర్తి కలిగిస్తుందని అన్నాడు. ‘‘ఇది చారిత్రాత్మక విజయం’’ అని టెండూల్కర్ ట్వీట్ చేయగా.. మిమ్మల్ని చూసి దేశం మొత్తం గర్విస్తోందని బజరంగ్ పునియా ట్వీట్ చేశాడు.


చైనా క్రీడాకారిణి ఝౌ యింగ్‌తో జరిగిన టేబుల్ టెన్నిస్ ఫైనల్‌లో పరాజయం పాలైన భవీనా రజత పతకంతో సరిపెట్టుకుంది. ఫలితంగా పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్ విభాగంలో మెడల్ సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కింది. 

Updated Date - 2021-08-29T21:55:39+05:30 IST