ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి

ABN , First Publish Date - 2022-06-28T05:20:03+05:30 IST

‘ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి. తల్లిదండ్రులు ఆడపిల్లలను కచ్చితంగా ఉన్నత చదువులు చదివి ంచాలి’ అని కలెక్టర్‌ కె.వి.ఎన్‌. చక్రధర్‌బాబు అన్నారు.

ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి
బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న జిల్లా కలెక్టర్‌ కేవిఎన్‌.చక్రధర్‌బాబు

ఏటా యూనివర్సిటీ ప్రగతి పెరగాలి

 కలెక్టర్‌ కేవిఎన్‌ చక్రధర్‌బాబు

 వెంకటాచలం, జూన్‌ 27: ‘ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి. తల్లిదండ్రులు ఆడపిల్లలను కచ్చితంగా ఉన్నత చదువులు చదివి ంచాలి’  అని కలెక్టర్‌ కె.వి.ఎన్‌. చక్రధర్‌బాబు అన్నారు. మండ లంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో రూ. 73లక్షలతో నిర్మించిన బాలికల వసతిగృహం అదనపు గదులను సోమవారం కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావే శంలో  కలెక్టర్‌ మాట్లాడుతూ యూనివర్సిటీ ఏర్పడిన ప్పటినుంచి విద్యార్థినుల నమోదు శాతం పెరుగుతూ వస్తోందన్నారు.  పది నుంచి ఇంటర్‌కు వచ్చే సరికి బాలికల శాతం తగ్గుతోందని, దీనిపై విశ్వవిద్యాలయాలు ప్రత్యేక దృష్టి సారించాల న్నారు.  నాణ్యమైన విద్యను అందించి జిల్లాకు చెందిన విద్యా ర్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే ఉన్నత చదువులు చదివేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఉపకులపతి ఆచార్య సుందరవల్లి మాట్లాడుతూ కలెక్టర్‌ సహకారంతో విద్యార్థు లకు యూనివర్సిటీలో అవసరమైన మౌలిక  సదుపాయాలు కల్పించా మన్నారు. త్వరలోనే రూ.30 కోట్లతో నిర్మాణాలు చేసుకుం టున్న పరిపాలన భవనం, ల్యాబ్‌, క్లాస్‌ రూములు, వసతి భవనాలను ప్రారంభిస్తామన్నారు. అనంతరం పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు 21ఫస్ట్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ రూపొందించిన బ్రోచర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. కార్యక్ర మంలో ప్రిన్సిపాల్‌ విజయానంద కుమార్‌, డిఈ. శ్రీనివాస కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T05:20:03+05:30 IST